Webdunia - Bharat's app for daily news and videos

Install App

రుద్రాక్షలు ధరిస్తారు సరే... నియమాలు ఏమిటో తెలుసా...?

రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్

Webdunia
బుధవారం, 7 సెప్టెంబరు 2016 (15:13 IST)
రుద్రాక్షలను శివుని ప్రతిరూపాలుగా కొలుస్తాము. రుద్రాక్షలు పవిత్రమైనవి, శక్తివంతమైనవి, మహిమాన్వితమైనవి. రుద్రాక్షలు ధరించడంవల్ల అనుకున్న పనులు నెరవేరతాయి. ఎలాంటి కష్టనష్టాలు రావు. అడ్డంకులు తొలగిపోయి, సుఖసంతోషాలతో గడిపేందుకు పరమశివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష. తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నవారు, అనారోగ్య సమస్యలతో జారిపోతున్నవారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి. 
 
అంతేకాదు, ఏవైనా వ్యసనాలకు లోనయినవారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి, అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్షమాలను ధరిస్తే చాలా మంచి ఫలితముంటుంది. మెడ, చేతులు, చెవులకు, రుద్రాక్షలను ధరించినవారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేనివారిగా భాసిస్తారు. ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవయ్యొక్క రకాలుగా విభజించారు.
 
రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి.  1. రుద్రాక్షమాలను ధరించి మైలపడిన వారిని తాకకూడదు. 2. రుద్రాక్ష మాలను ధరించి శ్మశానానికి వెళ్లకూడదు. 3. కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు. 4. రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు 5. రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు 6. రుద్రాక్షమాలను ధరించి శృంగారంలో పాల్గొనకూడదు. 7. స్త్రీలు రుతుసమయంలో రుద్రాక్షమాలను ధరించకూడదు.
 
ఏక ముఖి రుద్రాక్ష బహు అరుదైనది. ఈ రుద్రాక్ష ధరించడం వల్ల ఏకాగ్రత కలుగుతుంది, పవిత్ర భావనలు పొందుతారు, దుష్టశక్తుల ప్రభావం తగ్గుముఖం పడుతుంది. సంఘంలో, తన చుట్టూ ఉన్నవారిమధ్య కీర్తి పెరుగుతుంది, ఆర్థిక స్థిరత్వం కలగటానికి దోహదపడి ఉద్యోగ వ్యాపార లేదా సంపాదన అభివృద్ధికి స్థిరీకరణకు కలిగే దోషాలను తొలగించగలిగే శక్తిని బుద్ధిని ఇస్తుంది. కొన్ని రకాల దీర్ఘవ్యాధులు, మానసిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి. 
 
విటమిన్‌ డి లోపం వల్ల కలిగే వ్యాధులు తగ్గుముఖం పడతాయి. పంచముఖి రుద్రాక్ష ఆడ, మగ, పిల్లలు అందరికీ మంచిదే. అది సౌఖ్యానికి, ఆరోగ్యానికి, స్వతంత్రతకూ సర్వత్రా దోహదకారి. రుద్రాక్ష రక్తపోటుని కూడా తగ్గిస్తుంది. నరాలకు కొంత నెమ్మదిని కలిగించి నాడీ వ్యవస్థకు కొంత స్వాంతన, చురుకుదనాన్ని కలిగిస్తుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

రూ.1 కోటి విలువైన 1,000 దొంగలించబడిన మొబైల్ ఫోన్లు స్వాధీనం

అర్జెంటీనాకు చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. 57 సంవత్సరాల తర్వాత..? (video)

హిమాచల్ ప్రదేశ్- ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు.. 130మందికి పైగా మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

30-06-2025 సోమవారం దినఫలితాలు - వాగ్వాదాలకు దిగవద్దు... సహనం పాటించండి..

తర్వాతి కథనం
Show comments