పళని దండాయుధ పాణి ఆలయంలో కుంభాభిషేకం (video)

Webdunia
శుక్రవారం, 27 జనవరి 2023 (14:02 IST)
Palani kumbabishekam
పళని దండాయుధ పాణి ఆలయంలో జనవరి 27న కుంభాభిషేకం అట్టహాసంగా జరిగింది. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు జరిగింది. దండాయుధపాణి స్వామి ఆలయం తమిళనాడు దిండుక్కల్ జిల్లాలోని పళనిలో ఉంది. కుమార స్వామి ప్రతిష్టాత్మక ఆరు క్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయంలోని మూలవిరాట్టు నవపాషాణంతో రూపుదిద్దుకుంది.
 
పాదవినాయకుడు, క్షేత్రపాలకులు, 5 నెమలి విగ్రహాలు, మెట్ల దారి క్షేత్రాలు, వినాయగర్ విగ్రహాలు, ఇడుంబన్, కడంబన్, అగస్త్యుడు, సర్ప వినాయకుడు, జంట వినాయకుల విగ్రహాలకు కుంభాభిషేకం జరుగనుంది. 
 
ఈ పళని ఆలయంలో 16 ఏళ్ల తర్వాత 27వ తేదీన కుంభాభిషేకం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల మధ్య రాజగోపురం, స్వర్ణ విమానానికి తీర్థ అభిషేకం, అనంతరం స్వామివారికి కుంభాభిషేక కార్యక్రమం నిర్వహించారు. 
Palani kumbabishekam
 
కుంభాభిషేకం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 4.30 గంటలకు 8వ యాగశాల పూజలు ప్రారంభమయ్యాయి. కుంభాభిషేకం సందర్భంగా దీపారాధన అనంతరం రాజగోపురంతో పాటు ఆలయ సముదాయం అంతటా హెలికాప్టర్‌లో పుష్పయాగం నిర్వహించారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రైవేట్ హెలికాప్టర్‌ను రప్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మరో ఆరుగురుని బలి తీసుకున్న శంషాబాద్ ఓఆర్ఆర్, కారు అతివేగమే కారణం

నేనే సీఎం, మీరే మంత్రులు: ఎమ్మెల్యే అభ్యర్థులతో టీవీకె విజయ్

భర్త ఆత్మహత్య చేసుకున్న నెల రోజుల్లోనే ప్రియుడిని పెళ్లాడిన మహిళ

కారును ఎత్తెత్తి పడేసిన ఏనుగు, ఒకరు మృతి, వీడియో

తాజ్ ఎక్స్‌ప్రెస్‌పై దాడి ... ప్రయాణికుడికి గాయాలు (వీడియో)

అన్నీ చూడండి

లేటెస్ట్

మంగళవారం నాడు ప్రదోషం వస్తే.. భౌమ ప్రదోషం.. శివపూజ చేస్తే?

28-04-2026 మంగళవారం ఫలితాలు - కానుకలిచ్చిపుచ్చుకుంటారు...

26-04-2026 ఆదివారం ఫలితాలు - కష్టించినా ఫలితం ఉండదు...

26-04-2026 నుంచి 02-05-2026 వరకు ఫలితాలు - అహంకారం ప్రదర్శించవద్దు

ఆదివారం ఆదిత్యుడిని పూజిస్తే...?

తర్వాతి కథనం
Show comments