Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాఘ పూర్ణిమ.. సముద్ర స్నానం.. శివాలయంలో నువ్వులనూనెతో ...

Webdunia
శుక్రవారం, 3 ఫిబ్రవరి 2023 (18:45 IST)
మాఘ పూర్ణిమ ఈ నెల ఐదో తేదీన వస్తోంది.  మాఘమాసం స్నానాలకు ప్రసిద్ధమైంది. అలాంటి ఈ మాఘ మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత వుంది.  మాఘపూర్ణిమను "మహామాఘి'' అని అంటారు. ఈ మహామాఘి శివకేశవులకు ప్రీతికరం. 
 
మాఘ పూర్ణిమ రోజున సముద్ర స్నానం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇలా సముద్ర స్నానం చేస్తే సకల నదులలోనూ స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుంది. 
 
శుక్ల, కృష్ణ పక్షాలలోనే గాకుండా మాఘపూర్ణిమ నాడు స్నానానంతరం తిలలు, ఉసిరికలు, దానం చేయవచ్చు. నియమంగా శివపూజ, విష్ణుపూజ, అభీష్ట దేవతాపూజ చేయాలి.
 
ఈ మాసంలో శివాలయంలో నువ్వులనూనెతో దీపాలు వెలిగించడం సకల శుభాలనూ ప్రసాదిస్తుంది. ఈ మాసంలో ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున శివాలయంలో దీపమెట్టడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం.

మాఘి పూర్ణిమ నాడు, భక్తులు తెల్లవారుజామున పవిత్ర నదిలో స్నానం చేయాలి.
 
-స్నానం చేసిన తర్వాత సూర్య మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి.
 
-శ్రీకృష్ణుడిని పూజించి ఉపవాసం ఉండాలి.
 
- పేదలకు, బ్రాహ్మణులకు ఆహారం దానంగా అందించాలి.
 
- నల్ల నువ్వులు దానం చేయాలి.
 
-'ఓం నమో నారాయణ' మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

శనివారం కాలాష్టమి: నల్ల శునకాలకు రొట్టెలు.. ఇప్పనూనెతో దీపం

2025 కర్కాటక రాశికి కలిసొస్తుందా? వృత్తి జీవితం ఎలా వుంటుంది?

2025లో మిథునరాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే? కష్టం ఫలిస్తుందా?

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

2025 మేషరాశి వారి కెరీర్, ఉద్యోగం, వ్యాపారం ఎలా వుంటుందంటే?

తర్వాతి కథనం
Show comments