మంగళవారాల్లో హనుమకు లడ్డూ, అరటి పండ్లు సమర్పిస్తే?

సెల్వి
మంగళవారం, 23 డిశెంబరు 2025 (08:33 IST)
Hanuma
మంగళవారం హనుమంతుడిని పూజించడం ద్వారా బలం, ధైర్యం పెరుగుతుంది. ఈ రోజున భక్తులు హనుమాన్ చాలీసాను జపిస్తూ ఎర్రటి పువ్వులు, సింధూరం, స్వీట్లు సమర్పిస్తారు. ఈ రోజు ఉపవాసం ఉండటం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. 
 
ఈ ఉపవాస వ్రతం ద్వారా జీవితంలో అడ్డంకులను తొలగిపోతాయని, మంచి ఆరోగ్యం, శ్రేయస్సు లభిస్తుందని.. ప్రతికూల శక్తుల నుండి రక్షణ కల్పిస్తుందని విశ్వసిస్తారు. మంగళవారం హనుమంతుడిని పూజించడం వల్ల జాతకంలో కుజుదోషాలు తొలగిపోతాయి. ఇంకా జీవితంలో శాంతి, విజయాన్ని పొందుతారని విశ్వాసం. 
 
ఆవు నెయ్యితో దీపం వెలిగించి, సింధూరం, తమలపాకుల మాల, ఎర్రటి పువ్వులు లేదా ఎర్రటి పూల దండ, ఎర్రటి కొత్త వస్త్రాన్ని హనుమంతునికి ఆలయాల్లో సమర్పించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అలాగే లడ్డూలను, అరటిపండ్లను ప్రసాదంగా సమర్పిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.  
 
ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాత హనుమంతుడిని పూజించి, మంగళవార వ్రత కథను చదివి పూజను ప్రారంభించాలి. హనుమంతుడు శ్రీరాముని గొప్ప భక్తుడు. అందుచేత శ్రీరాముడిని ప్రార్థించడం లేదా రామాయణంలోని సుందరకాండ అధ్యాయాన్ని చదవడం హనుమంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన దివ్య ఆశీస్సులను పొందడానికి సులభమైన మార్గం.
 
పూజ చివరిలో పువ్వులు సమర్పించి, హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ పూజ పూర్తయిన తర్వాత, ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టాలి. రోజంతా ఉపవాసం వుండటం చేయవచ్చు. సాధ్యం కాకపోతే, గోధుమలు, బెల్లంతో చేసిన ఆహారంతో పాటు ప్రసాదాన్ని తీసుకోవచ్చు.
 
 
ఈ రోజున ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం, అవసరమైన వారికి దుస్తులు దానం చేయడం ద్వారా ఈతిబాధలు, శనిగ్రహ బాధలు తొలగిపోతాయి. ఇలా వరుసగా 21 మంగళవారాలు పూజ చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagababu: రామాయణంపై ప్రకాష్ రాజ్‌ కామెంట్లు.. నాగబాబు ఏమన్నారంటే?

బుల్లెయ వే కోక్ స్టూడియో భారత్ బుల్లెయా వెలో

Pawan Kalyan: ఆరోగ్య సమస్య.. శస్త్ర చికిత్స చేయించుకున్న పవన్ కల్యాణ్.. ఏమైంది?

కాంగ్రెస్ - డీఎంకేల వల్లే మహిళా బిల్లుకు మోక్షం లభించలేదు : ప్రధాని మోడీ

మహిళను వెనుక నుంచి అసభ్యంగా తాకిన కామాంధుడు కాళ్లుచేతులు విరిగాయి, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

16-04-2026 గురువారం ఫలితాలు-మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది

పళ్లెంలో వడ్డించిన భోజనాన్ని మెతుకు మిగలకుండా తింటే దరిద్రం వస్తుందా?

చైత్ర అమావాస్య: చీమలకు పంచదార.. సర్పదోషాలు మటాష్

తిరుమలలో భక్తుల రద్దీ.. మే 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు

15-04-2026 బుధవారం ఫలితాలు - రుణసమస్య పరిష్కారమవుతుంది.. ఖర్చులు సామాన్యం...

తర్వాతి కథనం
Show comments