బ్రహ్మదేవుడు 5 ముఖాలు కలవాడు... మరి చతుర్ముఖుడు ఎలా అయ్యాడు?

Webdunia
మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (21:40 IST)
బ్రహ్మదేవుడికి 5 ముఖాలు ఉండేవి. బ్రహ్మ విష్ణువు ఇరువురిలో ఎవరు గొప్పవారు అనే సంవాదం వచ్చినప్పుడు శివుడు లింగాకారం ధరించి విష్ణువుని తన మూలం చూసి రమ్మని, బ్రహ్మను తన అగ్ర భాగం చూసి రమ్మని చెప్పాడు. విష్ణువు వరాహ రూపంలో కిందికి వెళ్ళి లింగమూలం చూడలేక తిరిగి వచ్చి శివుడికి నిజం చెప్పాడు. బ్రహ్మ హంస రూపుడై పైకి పోయి అగ్రభాగం చూడకున్నా చూసానని అబద్దం చెప్పాడు. 
 
అసత్య దోషం వల్ల అతని ముఖం ఒకటి గాడిద ముఖంగా మారిపోయింది. బ్రహ్మ తాను అధికుడునని గర్వంచినందుకు, గర్వం తగదని శివుడు చెప్పినా వినలేదు. పైగా తన గాడిద ముఖంతో శివుణ్ణి తీవ్రంగా దూషించాడు. శివుడు కాలభైరవుణ్ణి సృష్టించి తనను దూషించిన బ్రహ్మ శిరస్సును ఖండించమన్నాడు.
 
బైరవుడు శివుని ఆదేశం మేరకు ఆ తలను ఖండించాడు. అలా ఖండింపబడిన బ్రహ్మ శిరస్సుకు చెందిన కపాలం చేతబట్టి శివుడు భిక్షాటనం చేస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అలా బ్రహ్మ దేవుడు చతుర్ముఖుడు అయ్యాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్ నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ కాంస్య విగ్రహం

సిద్ధరామయ్య ఇంట్లో అల్పాహార సమావేశం.. కావేరికి చేరిన డీకే శివకుమార్

నలుగురైదుగురు భార్యలని మాట్లాడి ఓ పార్టీ భూస్థాపితం, ఇదేనా జర్నలిజం: తెలంగాణ జనసేన

అమిత్ షా గారూ, ఆయన్ని అరెస్ట్ చేయరా: డిప్యూటీ సీఎం పవన్ డైలాగ్‌తో పగలబడి నవ్విన జనసైనికులు, వీడియో

Vijay : ఢిల్లీలో ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

తర్వాతి కథనం
Show comments