Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపావళి రోజున కేదార గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే..?

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2022 (23:37 IST)
kedara gowri vratham
కేధార గౌరీ వ్రతం, అన్ని ప్రయోజనాలను ప్రసాదిస్తుంది. సమస్త సంపదలను ప్రసాదిస్తుంది. అష్టైశ్వర్యాలను చేకూర్చుతుంది. పూర్వం పుణ్యవతి, భాగ్యవతి అనే ఇద్దరు సోదరీమణులు ఉండేవారు. ఇద్దరూ యువరాణులు. వారి తండ్రి యుద్ధంలో ఓడిపోవడంతో వారు ప్రవాసంలో ఉన్నారు.

ఒకరోజు దేవ కన్యలు కేదారగౌరీ వ్రతం చేస్తూ నదీతీరానికి వెళుతున్నారు. ఆ వ్రతం, ఉపవాసం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ వ్రతాన్ని ఆచరించారు. ఈ వ్రత మహిళ కారణంగా పుణ్యవతి, భాగ్యవతి సంపన్నులైనారు. వారి తండ్రి పోగొట్టుకున్న రాజ్యాన్ని వారసత్వంగా పొందారు.

ఇద్దరికీ మంచి భర్తలు లభించారు. ఇంతటి సంపత్తు లభించేందుకు కారణమైన ఉమాదేవి ఆరాధనతో కూడిన కేధార గౌరీ వ్రతం పాటించారు. ఆపై వ్రతాన్ని పాటించకుండా వదిలేసింది భాగ్యవతి. ఆపై తప్పు తెలుసుకుని ఈ వ్రతాన్ని తిరిగి ఆచరించింది. ఆపై సంపదలను పొందింది.

దీపావళి లేదా కార్తీక మాసంలో చంద్రుడు కృత్తిక నక్షత్రంలో కలిసి వున్నరోజు కార్తీక పౌర్ణమి వస్తుంది. ఆ రోజున కూడా కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోనూ శివుడిని ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్న వారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్త్రాలకు లోటుండదని భక్తుల విశ్వాసం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు.

కేదారమనగా వరిమడి, పాదు, శివక్షేత్రమని పేరు. ఈశ్వరుడనగా ప్రభువు. పరమాత్మ అని అర్థము. కేదారేశ్వరుడనగా శివుడు. వేద ప్రతిపాదితమైన రుద్రుడే శివుడు. మహాదేవుడు. పశుపతి. కేదారేశ్వర వ్రతం భార్యాభర్తలిద్దరూ కలిసి చేసుకునే వ్రతం.

గతంలో దీపావళి పండుగనాడు చేసుకునేవారు. ఇటీవల కార్తీకమాసంలో నిర్వహించుకుంటున్నారు. ఈ వ్రతానికి ముందుగా 21 పేటల పట్టుదారాన్ని కాని, నూలుదారాన్ని కాని తోరంగా కట్టుకోవాలి. పూజలో గోధుమ పిండితో చేసిన అరిసెలను పాలు, పెరుగు, నెయ్యి, పాయసాలతో పాటు 21 రకాల ఫలాలను, కూరలను నైవేద్యంగా సమర్పించాలి. తేనె తప్పనిసరిగా ఉండాలి.

ఈ కేదారేశ్వర వ్రతాన్ని ఏకధాటిగా ఇరువది ఒక్క సంవత్సరాల పాటు నిర్వహించి, 21వ సంవత్సరములో పూజాంతములో ఉద్యాపనం చేసుకోవాలి. నైవేద్యం చేయాలి. ఇలా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Marwadi go back: మార్వాడీ గో బ్యాక్.. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బంద్

Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి మృతి

58వ ఎజిఎం-66వ జాతీయ సింపోజియం 2025ను ప్రారంభించిన మంత్రి ప్రొఫెసర్ ఎస్.పి. సింగ్ బఘేల్

టీవీ సీరియల్ చూస్తూ భర్తకు అన్నం పెట్టని భార్య, కోప్పడినందుకు పురుగుల మందు తాగింది

Women Entrepreneurship: మహిళా వ్యవస్థాపకతలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్

అన్నీ చూడండి

లేటెస్ట్

21-08-2025 రాశి ఫలితాలు.. ఈ రాశికి ఈ రోజు నిరాశాజనకం

121 kg gold: 121 కేజీల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

Pradosha Vratham: 12 సంవత్సరాల పాటు ప్రదోష వ్రతం పాటిస్తే ఏమౌతుందో తెలుసా?

Saumya pradosh: బుధవారం ప్రదోషం.. శివాలయాల్లో సాయంత్రం పూట ఇలా చేస్తే?

20-08- 2025 బుధవారం ఫలితాలు - సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు...

తర్వాతి కథనం
Show comments