Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవరాత్రి రోజుల్లో శక్తి ఆరాధన.. రెండో రోజు ఆకుపచ్చ దుస్తులు ధరిస్తే?

Parvati
, సోమవారం, 26 సెప్టెంబరు 2022 (21:19 IST)
నవరాత్రి రోజుల్లో శక్తి ఆరాధన ముఖ్యమైన స్థానం ఉంది. అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు నైవేద్యాలతో పూజించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దుర్గాదేవిని నవరాత్రులు తొమ్మిది రోజుల్లో విభిన్న రూపాలను పూజిస్తారు. దుర్గాదేవిని అనేక రూపాలలో పూజించడం వల్ల అనుకూల ఫలితాలు ఏర్పడతాయని విశ్వాసం. 
 
నవరాత్రి 9 రోజుల్లో 9 శక్తి రూపాలతో భక్తులు తొమ్మిది రకాల కోరికలు నెరవేరడమే కాకుండా తొమ్మిది గ్రహ దోషాలు కూడా దూరమవుతాయట. అమ్మవారిని కొన్ని నియమ నిబంధనలతో పూజిస్తే.. జాతకంలో ఏర్పడ్డ అనేక దోషాలు తొలగిపోయి సంపద లభిస్తుందని భక్తుల విశ్వాసం.
 
నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఇక శరన్నవరాత్రుల్లో రెండో రోజైన 27వ తేదీ రెండో రోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. 
 
అమ్మకు లేత గులాబీ రంగు వస్త్రంతో అలంకరించాలి. బంగారు రంగు పాజిటివ్‌ ఎనర్జి తీసుకువస్తుందన్నది భక్తుల నమ్మకం. ఇక నైవేద్యంగా పులిహోరను పెట్టాలి. దీన్ని ద్వారా సకల దోషాలు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 
 
నవరాత్రి రెండో రోజు తల్లి బ్రహ్మచారిణికి ఆరాధిస్తారు. ఆ దేవతను ప్రసన్నం చేసుకోవడానికి ఈ రోజున ఆకుపచ్చ రంగును ధరించండి. ఇది జీవితంలో పురోగతిని తెస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవీ నవరాత్రులు ప్రారంభం.. శైలపుత్రిగా బెజవాడ కనకదుర్గమ్మ.. ఇలాచేస్తే?