Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మహాలయ అమావాస్య.. అవిసె ఆకులు గోవులకు ఇస్తే?

Advertiesment
Puja
, శనివారం, 24 సెప్టెంబరు 2022 (09:40 IST)
మహాలయ అమావాస్య రోజున అన్నదానం చేయడం మంచిది. మనుష్యులకే అన్నదానం చేయకుండా జంతుజాలానికి కూడా పెట్టాల్సి వుంటుంది. కాకి, ఆవు వంటి ఆహారం పెట్టాలి. ''లోకానం నరజన్మం దుర్లభం'' అంటారు.. ఎన్నో వేల జన్మలకు గానీ నరజన్మ ప్రాప్తించదు. అలాంటి జన్మనిచ్చిన మన పూర్వీకులను గుర్తించుకోవాలి. అందుకే పితృపక్షంలో కనీసం ఒకరోజైనా వారికి తర్పణం వదలాలి. 
 
సాధ్యం కానివారు మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేసి వారిని స్మరించుకోవడం చేస్తే శుభ ఫలితాలు చేకూరుతాయి. సూర్యుడు కన్యారాశిలో ప్రవేశించగానే పితరులు తమ పుత్ర, పౌత్రుల దగ్గరకు వస్తారని చెప్పబడింది. మహాలయ అమావాస్య నాడు వారు తమ సంతతి ద్వారం దగ్గరే నిలబడతారు. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. 
 
జాతక చక్రం పరిశీలన ద్వారా ఇలాంటి దోషాలు వున్నాయని తెలిస్తే మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధం ఇవ్వడం దానధర్మాలు చేయడం ద్వారా వాటిని పోగొట్టుకోవచ్చు.
 
మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేసాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వర్తించటం చేత పితరులకు తృప్తి కలుగుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మహాలయ అమావాస్య రోజున దీపదానం, పిండదానం ప్రాముఖ్యత గురించి ప్రస్తావించబడింది. 
 
ఈ రోజున పాలు, ఉడకబెట్టిన అన్నం, నువ్వులు కలిపి ముద్దగా చేస్తారు. అలాగే, ఈ రోజు సాయంత్రం పూజా స్థలంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. 
 
అంతేకాదు, మహాలయ అమావాస్య రోజున పేదవారికి లేదా బ్రాహ్మణులకు అన్నం పెట్టడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. పూర్వీకులకు నైవేద్యం పెట్టిన తర్వాత ఆవుకు పచ్చి మేత తినిపిస్తే (అంటే అవిసె ఆకులు వంటివి) పూర్వీకులకు తృప్తి కలుగుతుంది. ఈ రోజున నల్ల చీమలకు పంచదార కలిపి నైవేద్యంగా పెడితే మన పూర్వీకులు మన దోషాలన్నింటినీ పరిహరిస్తారని నమ్మకం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాలయ అమావాస్య.. బియ్యం, కూరగాయలు, ఉప్పు, పప్పు ఇస్తే..?