కార్తీకంలో పంచాక్షరీతో పరమశివుడిని అర్చిస్తే గ్రహదోషాలుండవు.. (video)

ఎన్ని వ్రతాలు చేసినా, దానాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే.. ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పిస్తే చాలు జన్మ ధన్యమౌతుంది. ఒక పొద్దు ఉపవాసం వుంటే చాలు.. కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దా

Webdunia
బుధవారం, 15 నవంబరు 2017 (14:56 IST)
ఎన్ని వ్రతాలు చేసినా, దానాలు చేసినా కార్తీక వైభోగం కార్తీక వైభోగమే.. ఒక్క బిల్వాన్ని శివుడికి అర్పిస్తే చాలు జన్మ ధన్యమౌతుంది. ఒక పొద్దు ఉపవాసం వుంటే చాలు.. కైలాసవాసం ప్రాప్తిస్తుంది. ఒక్క దీపాన్ని దానమిస్తే చాలు.. జీవితం ఐశ్వర్యమౌతుంది.

అలాంటి కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతం చేస్తుంటారు. ఉత్తర భారతంలో అయితే బిల్వపత్ర వ్రతాన్ని జరిపిస్తారు. అలాంటి శివుడిని కార్తీకమాసంలో పూజించడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి. శివునిని పూజించేటప్పుడు నుదుట విభూతిని ధరించడం చేయాలి. 
 
నుదుటన విభూతిని ధరించి పూజించడం ద్వారా శివుడిని అతి శీఘ్రముగా ప్రసన్నం చేసుకోవచ్చు. విభూతి అంటే భస్మం. భస్మ ధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి.. దివ్యత్వాన్ని ప్రసాదిస్తుంది. శివపూజ చేసేటప్పుడు తప్పకుండా మెడలో రుద్రాక్ష ధరించాలి. ఇక బిల్వ పత్రాలు తప్పకుండా శివపూజ చేసేటప్పుడు వుండి తీరాల్సిందే. బిల్వ పత్రాలను మీ చేతులతో శివునికి అర్చిస్తే పాపాలన్నీ హరించుకుపోతాయి. 
 
ఇక శివపూట చేసేటప్పుడు నోటివెంట శివ పంచాక్షరీ మంత్రాన్ని తప్పకుండా జపించాలి. ఓం నమశ్శివాయ, శివాయనమః, నమో భగవతే రుద్రాయ అనే మంత్రాలను ఉచ్చరిస్తూ వుంటే ఆ మహాదేవుడు కోరిన కోరికలను ప్రసాదిస్తాడు. గ్రహ దోషాలు తొలగించుకోవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వందే భారత్ స్లీపర్ రైలు కోల్‌కతా - గౌహతిలో మార్గంలో...

న్యూ ఇయర్ పార్టీలో విషాదం.. బిర్యానీ ఆరగించి వ్యక్తి మృతి.. మరో 15 మంది...

పెన్నును మింగుతానంటూ ఫ్రెండ్స్‌తో పందెం, మింగేసాడు

యువతిని ప్రేమించి పెళ్లాడాడని స్తంభానికి కట్టేసి కొట్టారు

చైనాలో సంతానోత్పత్తి పెరుగుదల కోసం తంటాలు.. కండోమ్స్‌పై పన్ను పోటు

అన్నీ చూడండి

లేటెస్ట్

వైకుంఠ ఏకాదశి విశిష్ఠత: తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడుతున్న ఆలయాలు (video)

30-12-2025 మంగళవారం ఫలితాలు - ఆశయసాధనకు ఓర్పుతో శ్రమించండి...

29-12-2025 సోమవారం ఫలితాలు - గ్రహబలం అనుకూలంగా లేదు.. భేషజాలకు పోవద్దు...

28-12-2025 నుంచి 03-01-2026 వరకు మీ వార రాశిఫలాలు

28-12-2025 ఆదివారం ఫలితాలు - శ్రమించినా ఫలితం శూన్యం...

తర్వాతి కథనం
Show comments