Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శివ శివా.. ఇదేమి పూజ.. శివలింగంపై పాదాలు మోపి పూజలు

సాక్షాత్తూ పరమశివుడి స్వరూపంగా శివలింగాన్ని భక్తులు అత్యంత నిష్టగా పూజిస్తారు. శివలింగంలోనే శివుని సాక్షాత్కారం పొందుతారు. హిమలింగ దర్శనం కోసం ఏటా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమరనాథ్‌ యాత్రకు వెళుతుంటారు

Advertiesment
శివ శివా.. ఇదేమి పూజ.. శివలింగంపై పాదాలు మోపి పూజలు
, గురువారం, 9 నవంబరు 2017 (09:44 IST)
సాక్షాత్తూ పరమశివుడి స్వరూపంగా శివలింగాన్ని భక్తులు అత్యంత నిష్టగా పూజిస్తారు. శివలింగంలోనే శివుని సాక్షాత్కారం పొందుతారు. హిమలింగ దర్శనం కోసం ఏటా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి అమరనాథ్‌ యాత్రకు వెళుతుంటారు. అలాంటి బోలాశంకరుడిని ఘోరంగా అవమానపరచాడు ఓ స్వామీజీ. శివలింగంపై పాదాలు మోపి పూజలు చేశాడు. ఈ ఘటన కర్ణాటకలో సంచలనమైంది. 
 
బెంగళూరు నగర శివారు నెలమంగల సమీపంలోని కెరెకత్తిగనూరు గ్రామంలోని ఓ శైవమఠంలో శివలింగంపై కాళ్లు పెట్టి శాంతిలింగేశ్వర స్వామిజీ పూజలు చేస్తున్న ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఆ స్వామిజీ తీరుపై శైవభక్తుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నెల 5న బెంగళూరు శివారు రంగనబెట్ట సమీపంలో శాంతలింగేశ్వర మఠానికి చెందిన మరో శాఖ ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా శివలింగానికి ప్రాణప్రతిష్ట చేసే సమయంలో మఠానికి చెందిన శాంతలింగేశ్వర స్వామి తన పాదాలను ఆ శివలింగంపై పెట్టగా, ఆయన శిష్యులు పూజలు చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. యేడాదిలో ఉగాది రోజు మాత్రమే మాట్లాడే శాంతలింగేశ్వర స్వామీజీ ఈ విషయమై తన శిష్యుల ద్వారా మీడియాకు వివరణ ఇప్పించారు. వీరశైవ విధానం ప్రకారమే పూజలు జరిగాయని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుభోదయం : 09-11-2017నాటి దినఫలితాలు