Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీ గురుచరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తే...?

Webdunia
గురువారం, 30 డిశెంబరు 2021 (23:33 IST)
గురువుని తెలుసుకునేదెలా...? అందుకు మొదట సద్గురువులు ఎలా ఉంటారో, వారి లక్షణాలేమిటో సంపూర్ణంగా తెలుసుకోవాలి. అట్టి లక్షణాలు అవతలి వ్యక్తిలో, అంటే గురువుగా పెట్టుకోవాలి అనుకునే వారిలో ఉన్నాయో లేదో నిశితంగా పరిశీలించాలి. 

 
ఎన్ని విధాలుగానైనా అట్టి వారిని పరీక్షచేసుకోవచ్చు. అందుకు ఎంతకాలమైనా తీసుకోవచ్చు. మనం దేనినైనా అంటే కూరగాయలనైనా సరే కొనడానికి వెళ్ళినప్పుడు అవి సరియైనవి అవునో కాదో అని ఎంతగానో పరిక్షిస్తాము కదా. అలాగే ఒక పెళ్ళి సంబందం చూడాలంటే ఎంతగానో అవతలి వారి వివరాలగూర్చి విచారిస్తాముగదా. అలాంటప్పుడు మన జీవితాన్ని సద్గురువుకి అప్పగించాలని తలచినప్పుడు ఎంతగానో పరిశీలించవలసిన అవసరమున్నది. అందుకని అప్రమత్తత లేకుండా క్షుణ్ణంగా అనుమానం లేని విదంగా పరీక్షించిన తరువాతనే గురువుగా ఎన్నుకోవాలి.

 
అయితే సరియైన గురువుని ఎన్నుకోవడానికి మన పరిజ్ఞానం చాలదు. కనుక సద్గురువు లభించాలని శ్రీ గురుచరిత్ర శ్రద్ధగా పారాయణ చేస్తే శ్రీ దత్తాత్రేయుడు స్వప్న దర్శనమిచ్చి మనకు తెలుపుతారు. అప్పుడు అట్టి గురువుని ఆశ్రయించడం సరియైన పద్దతి.
 
సద్గురువుని తెలుసుకున్న తరువాత వారిని తన గురువుగా భావించిన తర్వాత ఆయనను సంపూర్ణంగా విశ్వసించాలి. గురువు ఎంతటివారో గుర్తు పెట్టుకుని మనసు సడలకుండా జాగ్రత్త వహించాలి. ఆయన సర్వజ్ఞుడని. సర్వసమర్ధుడని మన ఐహిక ఆధ్యాత్మిక శ్రేయస్సు చేకూర్చే వారని సంపూర్ణంగా విశ్వసించాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆవు పేడ కుప్పలో రూ.20 లక్షల నోట్లు

గుంటూరు మేయరుపై కేసు నమోదు... అరండల్ పేట పోలీసులకు ఫిర్యాదు

లేడీ టీచర్ కుర్చీ కింద బాంబు అమర్చి రిమోట్‌తో పేల్చిన విద్యార్థులు.. ఎక్కడ?

రూ.25 లక్షలు లంచం పుచ్చుకుంటూ పట్టుబడిన డీఆర్ఎం సౌరభ్ ప్రసాద్

అడ్వాన్స్‌డ్ మిలిటరీ టెక్నాలజీ కలిగిన దేశాల జాబితాలో భారత్.. ఎలా?

అన్నీ చూడండి

లేటెస్ట్

కార్తీక పౌర్ణమి- 11 పిండి దీపాలను స్వచ్ఛమైన నెయ్యితో..?

మహానంది కోనేరులో ఆలయ గోపురాలు.. ఫోటో వైరల్

వైకుంఠ చతుర్దశి: శివాలయంలో దీపదానం చేస్తే ఏంటి ఫలితం?

14-11-2024 గురువారం ఫలితాలు - ధనలాభం, వాహన సౌఖ్యం ఉన్నాయి...

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్- శ్రీవాణి కౌంటర్‌లో ఇక దర్శనం టిక్కెట్లు

తర్వాతి కథనం
Show comments