డబ్బులుపోతే పోయింది.. పుణ్యమన్నా మిగిలింది... నల్లకుబేరులను దేవుడికి దగ్గర చేసిన మోడీ

నల్లకుబేరులను బ్యాంకు ముందు లైన్‌లో నిలబడేలా చేశాను. నాకు భయపడి తమ డబ్బులు గంగపాలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నల్లకుబేరులు తమ డబ్బులు ఎలా మార్చుకోవాలో తెలి

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (11:57 IST)
నల్లకుబేరులను బ్యాంకు ముందు లైన్‌లో నిలబడేలా చేశాను. నాకు భయపడి తమ డబ్బులు గంగపాలు చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనలు చేస్తున్నారు. ఎక్కడ చూసినా నల్లకుబేరులు తమ డబ్బులు ఎలా మార్చుకోవాలో తెలియక అల్లాడిపోతున్నారని సంబరపడిపోతున్నారు మోడీ. కానీ మోడీ తీసుకున్న నిర్ణయం నల్లకుబేరులను దేవుడికి దగ్గర చేరుస్తోంది. 
 
వీలైనంత మేరకు దొంగదారుల్లో మార్చుకుంటున్న బడా బాబులు, మిగిలింది హుండీలో వేసి పుణ్యం కట్టుకుంటున్నారు. దానికి గత పద్నాలుగు రోజులుగా పెరిగిన తిరుమల శ్రీవారి హుండీ ఆదాయమే నిదర్శనం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. ఒకప్పుడు హుండీ ఆదాయం కోటి దాటిందంటే అబ్బా అనే వారు రాను రాను రోజుకు కోటిన్నర ఆదాయం తిరుమల హుండీ ద్వారా వచ్చేది. బ్రహ్మోత్సవాలు వంటి సమయాల్లో భక్తులు ఎక్కువగా వచ్చినప్పుడు అది రూ.2 కోట్ల రూపాయలకు చేరేది. కానీ గడిచిన పదిరోజులుగా తిరుమల హుండీ ఆదాయం రోజుకు 3 కోట్ల రూపాయలు తగ్గడం లేదు. ఒకవైపు చిల్లర లేక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గుతుంటే మరోవైపు హుండీ ఆదాయం మాత్రం పెరిగిపోతుంది. 
 
దీనిని బట్టి చూస్తే బడాబాబులు తమ నోట్లను మార్చుకోవడానికి యేదారి లేక ఆ డబ్బులు శ్రీవారి సమర్పించుకుంటున్నారు. మోడీ ప్రకటన వెలువడిన రోజు నుంచి రెండున్నర కోటికి ఏ రోజు తగ్గలేదు హుండీ ఆదాయం. రోజుకు లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మాత్రం రూ.2 కోట్లు దాటుతుందని కానీ వస్తున్న భక్తుల సంఖ్య రూ.80 వేలకు మించడం లేదు. హుండీ ఆదాయం మాత్రం రూ.4 కోట్లకు చేరుతుంది. మోడీ నిర్ణయంతో ఎవరికి లాభనష్టాలు ఎలా ఉన్నా కలియుగ దేవుడు వేంకటేశ్వరుడికి మాత్రం కాసులు కురిపిస్తోంది. కుబేరుడిని వడ్డీలు కట్టలేక అల్లాడిపోతున్న ఆ వడ్డీకాసుల వాడు మోడీ పుణ్యమా అని అప్పులైనా తీర్చుకుంటాడేమో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

ప్రియుడితో తిరగడాన్ని అడ్డు చెప్పారని తల్లిదండ్రులను, చెల్లిని హత్య చేసిన యువతి పరార్

అన్నీ చూడండి

లేటెస్ట్

Nirjala Ekadashi 2026: నిర్జల ఏకాదశి నాడు ఏం చేయాలి..?

23-06-2026 మంగళవారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

22-06-2026 సోమవారం ఫలితాలు - ఎవరినీ నిందించవద్దు

21-06-2026 - ఆదివారం మీ రాశి ఫలితాలు - రుణవిముక్తులవుతారు

సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?

తర్వాతి కథనం
Show comments