Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆషాఢమాసం ... అనారోగ్యాల కాలం..

ఆషాఢమాసం అనగానే అదో కీడు నెలగా భావిస్తారు. కొత్తగా పెళ్లయిన యువతులు అత్తారింట్లో ఉండరాదని, యువకులు ఆ నెల రోజులూ అత్తారింటికి వెళ్లరాదనే నియమం పెట్టినట్టు పెద్దలు చెప్తున్నారు. దీంతో పాటు స్త్రీలు గర్భ

Webdunia
శుక్రవారం, 13 జులై 2018 (10:50 IST)
ఆషాఢమాసం అనగానే అదో కీడు నెలగా భావిస్తారు. కొత్తగా పెళ్లయిన యువతులు అత్తారింట్లో ఉండరాదని, యువకులు ఆ నెల రోజులూ అత్తారింటికి వెళ్లరాదనే నియమం పెట్టినట్టు పెద్దలు చెప్తున్నారు. దీంతో పాటు స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలు, అశుభ మాసంలో గర్భం ధరిస్తే ఉత్తమ సంతానం కలుగదనే నమ్మకం కూడా ఉండేది. దీంతో కొన్ని పనులకు ఆషాఢ మాసాన్ని నిషిద్ధం చేశారు.
 
పూర్వాషాఢ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢ మాసంగా పేర్కొంటారు. ఏడాదిలో మూడు శూన్యమాసాలుంటాయి. ఇందులో ఆషాఢం, బాధ్రపద, పుష్యమాసాలను శూన్యమాసాలు అంటారు. సాధారణంగా ఈ నెలల్లో శుభకార్యాలు చేయారు. 
 
వర్ష రుతువు కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే స్నానం, దానం, జపం, పారాయణం విశేష ఫలితాన్నిస్తాయని వేదపండితులు చెప్తున్నారు. ఈ నెలలో సముద్ర, నదీ స్నానాలు ఎంతో ముక్తిదాయకమని ప్రతీతి. ఈ మాసంలో గొడుగు, పాదరక్షలు, ఉప్పు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయంటారు.
 
అయితే, ఈ అషాఢ మాస కాలాన్నే అనారోగ్య కాలంగా పేర్కొంటారు. ఎందుకంటే ఈదురు గాలులతో చిరు వర్షపు జల్లులు పడే సమయమే ఆషాఢం. కాలువలు, నదుల్లో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు, చెరువుల్లోకి ప్రవేశించిన నీరు మలినంగా ఉంటుంది. ఈ నీరు సేవిస్తే అనారోగ్యాన్ని కల్గిస్తాయి. పొలం పనులు ఊపందుకునేది ఈ నెలలోనే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

27-07-2025 నుంచి 02-08-2025 వరకు వార ఫలితాలు - అపజయాలకు కుంగిపోవద్దు...

శ్రావణ ఆదివారం ఈ రెండు చేస్తే.. అప్పులుండవు.. కావాల్సిందల్లా బెల్లం మాత్రమే..

అష్టలక్ష్మీ దేవతలను ప్రార్థిస్తే...

Sravana Saturday: శ్రావణ శనివారం- ఈ పనులు చేస్తే శని గ్రహ దోషాలు మటాష్

26-07-2025 శనివారం దినఫలితాలు - ఆర్థికస్థితి నిరాశాజనకం...

తర్వాతి కథనం
Show comments