కార్తీక మాసంలో తులసీ మాతకు వివాహ మహోత్సవం జరిపిస్తే..

Webdunia
శుక్రవారం, 16 నవంబరు 2018 (11:00 IST)
కార్తీక మాసం పవిత్రమైనది. ఈ మాసంలో ప్రతిరోజూ ఈశ్వరుడిని ధ్యానించే వారికి సకలసంపదలు చేకూరుతాయి. కార్తీక సోమవారం పూట సోమేశ్వరుడైన ఈశ్వరుడిని ధ్యానిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడిని ధ్యానించి.. ఉపవాసముండి.. పంచాక్షరీ మంత్రంతో ఆయన్ని స్తుతించి.. పూజ చేస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
కార్తీక మాసాన్ని వైష్ణవ సంప్రదాయం ప్రకారం.. దామోదర మాసంగా పిలుస్తారు. దామోదర అనే పేరు.. శ్రీ కృష్ణ పరమాత్మునిది. క్యాలెండర్‌లో ఎనిమిదో మాసమైన కార్తీకంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. గంగానదికి ప్రత్యేక పూజలు తేస్తారు. పవిత్ర స్నానాదికాలు, పూజలు కార్తీక పూర్ణిమతో ముగుస్తాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున తులసీ వివాహ మహోత్సవాన్ని జరిపించే వారికి సర్వం సిద్ధిస్తుంది. ఏకాదశి లేదా పౌర్ణమి రోజుల్లో అదీ కార్తీక మాసంలో తులసీ వివాహ మహోత్సవాన్ని నిర్వహిస్తే.. సర్వాభీష్టాలు నెరవేరుతాయి. 
 
తులసీ మాతకు, షాలిగ్రామ్ స్వామి (విష్ణువు)కి ఈ వివాహాన్ని జరిపిస్తారు. అలాగే భీష్మ పంచక వ్రతాన్ని కొందరు కార్తీక ఏకాదశిలో ప్రారంభించి.. కార్తీక పౌర్ణమి రోజున ముగిస్తారు. వైష్ణవ సంప్రదాయం ప్రకారం భీష్మ పంచక వ్రతం కార్తీక మాసంలో చివరి ఐదురోజులు కూడా పాటిస్తారు. ఈ భీష్మ పంచకను విష్ణు పంచక అని కూడా పిలుస్తారు. 
 
ఇంకా వైకుంఠ చతుర్థి వ్రతం కూడా చతుర్థి తిథి రోజున కార్తీక మాసంలో పాటిస్తారు. ఇది కార్తీక పౌర్ణమికి ఒక్క రోజు ముందే వస్తుంది. ఈ రోజున శ్రీమహావిష్ణువే.. శివుడిని ఆరాధించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అనేక శివాలయాల్లో ఈ పూజను నిర్వహిస్తారు. ఇక త్రిపురాసురుడిని వధించిన కారణంగా కార్తీక పౌర్ణమిని దేవతలందరూ విజయ సూచకంగా జరుపుకున్నట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున గంగానదిలో వేలాది దీపాలు వెలుగుతూ కాంతులు వెదజల్లుతాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోడ్డుపై వాహనం ఆపి తీరిగ్గా ఫోన్ సంభాషణ చేస్తున్న వ్యక్తిని గుద్దేశాడు, తప్పెవరిది? వీడియో

మద్యం విషయంలో గొడవ.. యువకుడిని హత్య చేసిన ఇద్దరు స్నేహితులు

తితిదే ఇంజనీరింగ్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - మే 10 - 11 తేదీల్లో రాతపరీక్షలు

పీఎం ఈ-బస్ సేవా స్కీమ్‌- తిరుపతి నగరానికి 300 ఎలక్ట్రిక్ బస్సులు

ప్రియుడి భార్యను, పిల్లల్ని కత్తితో పొడిచి చంపిన మహిళ, కాళ్లు పట్టుకున్నా వదల్లేదు...

అన్నీ చూడండి

లేటెస్ట్

Masik Durgashtami: దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ.. ఎవరైతే విజయం కోరుకుంటారో?

24-04-2026 శుక్రవారం ఫలితాలు - పొదుపు ధనం అందుకుంటారు.

వైశాఖ మాసం.. అష్టమి రోజున కాలభైరవ పూజ చేస్తే.. కుంకుమ దానంతో...?

23-04-2026 గురువారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

తెరుచుకున్న కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు -51 క్వింటాళ్ల పూలతో అలంకరణ

తర్వాతి కథనం
Show comments