తులసీ దళాలతో విష్ణువును పూజిస్తే..?

మంగళవారం, 23 అక్టోబరు 2018 (13:22 IST)
తులసీ దళాలు ఆరోగ్యానికి ఎంత మంచివో అలానే పూజకు కూడా అంటే మంచివి. ప్రతి ఇంట్లో తులసి కోట తప్పసరిగా ఉంటుంది. కనుక మహిళలు రోజూ క్రమం తప్పకుండా భక్తిశ్రద్ధలతో తులసి కోటను ప్రదక్షణలు చేస్తే దీర్ఘసుమంగళీగా ఉంటారని పండితులు చెబుతున్నారు. శ్రీ మహావిష్ణువుకు తులసీ దళాలు చాలా ప్రీతికరమైనవి. ఈ తులసీ దళాలతో విష్ణువును ఆరాధిస్తే సకలసౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం.
 
''తులసీ దళ లక్షేణ కార్తికే యోర్చయేద్దరిం 
పత్రేపత్రే మునిశ్రేష్ఠ మౌక్తికం ఫలమశ్నుతే''
 
తులసీ దళాలతో విష్ణువును పూజిస్తూ ఈ మంత్రాన్ని జపిస్తే సకలసంపదలు వెల్లువిరుస్తాయని విశ్వాసం. కనుక మహిళలు ప్రతిరోజూ సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి భక్తిశ్రద్ధలతో ఈ మంత్రాన్ని స్మరిస్తూ విష్ణువుకు పూజలు చేయాలి. ఇలా చేయడం వలన ఆ గృహంలో ఎల్లప్పుడూ సిరిసంపదలు చేకూరుతాయని పురాణాలలో చెప్పబడింది. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆ దిశలో నిద్రిస్తే అనారోగ్యా సమస్యలు తప్పవు...