Publish Date: Tue, 23 Oct 2018 (13:04 IST)
Updated Date: Tue, 23 Oct 2018 (14:31 IST)
సాధారణంగా అందరి ఇంట్లో ఎలా పడితే అలా నిద్రపోతుంటారు. అలా నిద్రించడం మంచి కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. నిద్ర మనకు చాలా ముఖ్యమే అందుకని ఎలా పడితే అలా.. ఎక్కడ పడితే అక్కడి నిద్రించడం అంత మంచిది కాదు. కనుక వీలైనంత వరకు అలా నిద్రించడం మానేస్తే మంచిది. నిద్రపోవడం కూడా తప్పేనా అని.. కొందరు అనుకుంటారు.. తప్పేమి కాదు.. ఈ దిశలో నిద్రిస్తే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో తెలుసుకుంటే చాలు..
ఇంటి ఆవరణంలో మర్రిచెట్టు, బొప్పాయి, జవ్వి వంటి పాలుకారే చెట్లు, బలుసు పొదలు, ముళ్ళ మెుక్కలు, పత్తి బూరుగు వంటి చెట్టు ఉండడం అరిష్టదాయకమని చెప్తున్నారు. తూర్పు దిశగా తలవుంచి నిద్రించడం శుభదాయకమని వాస్తుశాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఉత్తర దిశలో నిద్రించడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
అందువలన దక్షిణ దిశలో నిద్రపోవడం వలన ఆయుర్‌వృద్ధి, పడమర దిశలో నిద్రిస్తే శారీరక బలం చేకూరుతుంది. ఉత్తర దిశలో నిద్రించడం వలన అనారోగ్య సమస్యలు తలెత్త ఆస్కారం ఉంది. కాబట్టి ఏకాగ్రతతో మెలగ వలసి ఉంటుంది.