గుడి పక్కన ఇంటి నిర్మాణం చేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా..?

శుక్రవారం, 12 అక్టోబరు 2018 (11:00 IST)
సాధారణంగా పెద్దలు ఆలయాల పక్కల ఇంటి నిర్మాణాలు చేయకూడదని చెబుతుంటారు. కానీ కొందరు గుడి పక్కన ఇల్లు ఉంటే మంచిదని భావిస్తారు. అసలు వస్తావం చెప్పాలంటే గుడి పక్కన ఇంటి నిర్మాణం ఎంతో శుభదాయకమని పురాణాలలో చెప్పబడింది. అందుకని గుడి పక్కనే కట్టుకోకుండా కాస్త దూరంగా అమర్చుకుంటే మంచిది. ఒకవేళ గుడి దక్షిణంలో మీరు ఇంటి స్థలాన్ని తీసుకున్నట్టయితే మీరు ఏర్పరచుకునే మాడవీధి కనీసం 20 అడుగులు ఉండాలి.
 
అలానే ఆ స్థలంలో చిన్న అండగి నిర్మించుకోవాలి. దీని నిర్మాణం కనీసం 10 నుండి 15 అడుగులు వచ్చేటట్లు చూసుకోవాలి. ఇలా చేయడం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. గుడి పక్క వీధిలో ఒక చిన్ని కాంపౌండ్‌ను కట్టుకోవాలి. తరువాత ఇంటి నిర్మాణం తూర్పు దిశలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే గుడి ప్రభావానికి, పవిత్రతకు భంగం కలుగదని వాస్తుశాస్త్రం చెబుతోంది.        

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం నవరాత్రి దేవి.. శ్రీ కృష్ణుడిచే పూజలందుకున్నదా?