Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఏ దేవాలయానికి వెళ్ళకూడదు.. ఎందుకు?

Advertiesment
శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఏ దేవాలయానికి వెళ్ళకూడదు.. ఎందుకు?
, గురువారం, 11 అక్టోబరు 2018 (15:10 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళిన భక్తులు దర్శనం పూర్తికాగానే తిరుమలకు దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాలను దర్శించుకుంటారు. కాణిపాకం, శ్రీకాళహస్తి, పాపవినాశనం ఇలా ఎన్నో దేవాలయాలను దర్శించుకుంటుంటారు. శ్రీకాళహస్తీశ్వరున్ని దర్శించుకున్న తరువాత మరే దేవాలయానికి వెళ్ళకూడదని చాలామంది చెబుతుంటారు. కానీ ఎందుకని మాత్రం చాలామందికి తెలియదు.
 
పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం. గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు. వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిశాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం. ఆలయంలో వెలసిన వాయులింగం కూడా. అయితే ఇక్కడ గాలి స్మరించినా, తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళకూడదన్న ఆచారం. సర్పదోషం, రాహుకేతు దోషం వచ్చిన తరువాత ఇక్కడ పూర్తిగా నయం అవుతుంది.
 
శ్రీకాళహస్తిలోని స్వామి దర్శనంతో సర్పదోషం తొలగిపోతుంది. ప్రత్యేక పూజలు చేసిన తరువాత నేరుగా ఇంటికి వెళ్ళాలంటారు పూజారులు. కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్ళడమే. తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్ళినా దోష నివారణ ఉండదని పూజారులు చెబుతుంటారు. గ్రహణాలు, శని బాధలు పరమశివునికి ఉండవని మిగిలిన అన్ని దేవుళ్ళకు శనిప్రభావం గ్రహణ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. దీనికి మరో ఆధారం చంద్రగ్రహణం. 
 
గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయంలో పాటు అన్ని దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణం అనంతరం సంప్రోక్షణ తరువాత తిరిగి ప్రారంభిస్తారు. కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచే ఉంచుతారు. గ్రహణం సమయంలో స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలను నిర్వహిస్తుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

11-10-2018 గురువారం దినఫలాలు - వృత్తుల వారు చెక్కులు చెల్లక...