Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నవరాత్రుల్లో వచ్చే మంగళవారం పూట రాహుకాలంలో..

నవరాత్రి రోజుల్లో ఆరాధించే పరాశక్తి సాక్షాత్తూ పరబ్రహ్మానికి, పరిపూర్ణతకు ప్రతిరూపం. ఆ తల్లి ఆనతి మేరకే త్రిమూర్తులు సైతం సృష్టి, స్థితి, లయలను వహిస్తున్నట్లు దేవీ భాగవతం చెబుతోంది. ఈ కాలంలో ఈ నవ దుర్

నవరాత్రుల్లో వచ్చే మంగళవారం పూట రాహుకాలంలో..
, మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:03 IST)
నవరాత్రి రోజుల్లో ఆరాధించే పరాశక్తి సాక్షాత్తూ పరబ్రహ్మానికి, పరిపూర్ణతకు ప్రతిరూపం. ఆ తల్లి ఆనతి మేరకే త్రిమూర్తులు సైతం సృష్టి, స్థితి, లయలను వహిస్తున్నట్లు దేవీ భాగవతం చెబుతోంది. ఈ కాలంలో ఈ నవ దుర్గల ఆరాధన జీవితంలో పరిపూర్ణత్వాన్ని అందిస్తుంది. 
 
పూర్వం ప్రపంచాన్ని పీడిస్తున్న దుర్గమాసురుణ్ణి బ్రహ్మాది దేవతలు అదుపుచేయలేకపోతారు. ఆ స్థితిలో లోకాలను రక్షించమని మునులు జగన్మాతను వేడుకొంటారు. కరుణాస్వరూపిణి అయిన ఆ జగన్మాత మనస్సు కరిగి దుర్గమాసురుడిని సంహరించి నాటి నుంచి 'దుర్గ'గా పూజింపబడుతోంది. 
 
అందుకే... సృష్టి, స్థితి లయకారిణి, అజ్ఞాన నాశినీ, భయహరిణీ, దుఃఖ నివారిణి, ఆత్మశక్తి ప్రదాయిని అయిన దుర్గామాతను శరణువేడితే దుర్గతి పోయి, సద్గతి ప్రాప్తిస్తుంది. అందుకే దుర్గాష్టమి రోజున అమ్మవారిని పూజించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయి. 
 
ఇంకా నవరాత్రుల్లో వచ్చే మంగళవారం పూట రాహుకాలంలో దుర్గకు దీపమెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అమ్మలగన్న అమ్మ అనుగ్రహం లభిస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విజయదశమి రోజున జమ్మిచెట్టు పూజిస్తే.. శనిదోషాలు మటాష్