Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంతకీ తెరుచుకోని ఏటీఎం యంత్రం... విసిగిపోయి ఎత్తుకెళ్లిన దొంగలు!!

వరుణ్
బుధవారం, 10 జులై 2024 (12:26 IST)
తెలంగాణా రాష్ట్రంలో కొందరు దొంగలు ఏకంగా ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకెళ్లారు. ఏటీఎం యంత్రంలోని నగదును చోరీ చేసేందుకు వచ్చారు. అయితే, ఏటీఎం యంత్రాన్ని పగులగొట్టేందుకు ప్రయత్నించగా, అది ఎంతకీ పగలలేదు. దీంతో విసుగు చెందిన దొంగలు ఏకంగా ఆ ఏటీఎం యంత్రాన్ని ఎత్తుకొని వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లా బిచ్‌కంద మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసులు, బ్యాంకు అధికారుల వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో నలుగురు దొంగలు క్వాలిస్ వాహనంలో బిచ్కుందకు వచ్చి ఎస్బీఐ బ్యాంకు పక్కనున్న ఏటీఎంలో చోరీకి యత్నించారు. ఏటీఎం ఎంతకూ తెరుచుకోకపోవడంతో దాన్ని తాళ్లతో తమ వాహనానికి కట్టి లాగారు. అనంతరం గది అద్దాల తలుపును ధ్వంసం చేసి ఏటీఎంను తమ వాహనం వెనుకభాగంలో ఎక్కించుకొని తీసుకెళ్లినట్లు సీసీ పుటేజీలో నిక్షిప్తమైంది.
 
దొంగిలిస్తున్న సమయంలో సైరన్ మోగడంతో అప్రమత్తమైన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. కానీ వారు సంఘటనా స్థలానికి చేరుకొనేలోగా దొంగలు పారిపోయారు. ఏటీఎంలో రూ.3.97 లక్షల నగదు నిల్వ ఉన్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులో గుల్ల వద్ద దొంగలు వినియోగించిన క్వాలిస్ కనిపించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
 
దుండగులు బిచ్కుంద మీదుగా జుక్కల్ చేరుకొని గుల్ల ప్రాంతం వద్ద వాహనాన్ని వదిలేసి మహారాష్ట్రకు పారిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దుండగులు పారిపోతూ మార్గం మధ్యలో జుక్కల్ మండలం పెద్దపడ్డి గ్రామంలో రెండు ద్విచక్ర వాహనాలను సైతం చోరీ చేశారని జుక్కల్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ, బిచ్కుంద సీఐ నరేష్ తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో కిరణ్ అబ్బవరం K-ర్యాంప్ మూవీ షూటింగ్ ప్రారంభం

సింగిల్ సినిమా వాయిదా వేయాలా వద్దా అని చర్చించాం: అల్లు అరవింద్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ చిత్రం భైరవం డేట్ ఫిక్స్

రౌడీ వేర్ లాభాల్లో కొంత వాటా భారత సైన్యానికి విరాళం: విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ బర్త్ డే విశెస్ తో ఎస్ వీసీ 59 పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

హైదరాబాద్‌లోని GKB ఆప్టికల్స్ స్టోర్‌ను సందర్శించిన క్రికెట్ స్టార్ పాట్ కమ్మిన్స్

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

తర్వాతి కథనం
Show comments