Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

స్కూలులో దెయ్యం ఉందని భయపడిన విద్యార్థులు... రాత్రంతా ఒంటరిగా స్కూల్‌లో నిద్రించిన టీచర్..

Advertiesment
students

వరుణ్

, బుధవారం, 10 జులై 2024 (10:14 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ - జైనద్ మండలం ఆనంద్‌పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో దెయ్యం ఉందంటూ ఆ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు భయంతో వణికిపోసాగారు. దెయ్యం లేదని ఉపాధ్యాయులు ఎంతగానో చెప్పినప్పటికీ విద్యార్థులు మాత్రం నమ్మలేదు. దీంతో ఒక ఉపాధ్యాయుడు సాహసం చేసి విద్యార్థుల్లో ఉన్న దెయ్యం భయాన్ని పోగొట్టాడు. 
 
ఆ స్కూల్ భవనంలోనే ఒంటరిగా రాత్రిపూట నిద్రపోయాడు. ఇలా విద్యార్థుల్లో భయం పోగొట్టాడు. ఆదిలాబాద్ - జైనద్ మండలం ఆనంద్‌పుర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో చెట్టు కూలడం, అలానే ఓ ఖాళీ గది నుంచి అరుపులు వస్తున్నాయని దెయ్యం ఉందనే భయం విద్యార్థుల్లో మొదలైంది. వారిలో భయం పోగొట్టేందుకు స్కూల్ టీచర్ రవీందర్ రాత్రంతా ఆ గదిలో నిద్రించారు. ఉదయం స్కూల్‌కు వెళ్లగా టీచర్ క్షేమంగా ఉండడం చూసి దెయ్యం లేదని విద్యార్థుల్లో నమ్మకం కలిగింది. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని నరేంద్ర మోడీ అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన రష్యా!!