Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తకు దూరంకాలేను.. ప్రియుడిని వదులుకోలేను... పరిష్కారం చూపమంటున్న వివాహిత

ఓ వివాహిత సంకటస్థితిని ఎదుర్కొంటోంది. ఇటు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను దూరం చేసుకోలేక.. ఫేస్‌బుక్ చాటింగ్ ద్వారా పరిచయమైన ప్రియుడిని వదిలిపెట్టలేక నరకయాతన అనుభవిస్తోంది. ప్రేమగా, అపురూపంగా చూసుకుంటు

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (12:31 IST)
ఓ వివాహిత సంకటస్థితిని ఎదుర్కొంటోంది. ఇటు అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను దూరం చేసుకోలేక.. ఫేస్‌బుక్ చాటింగ్ ద్వారా పరిచయమైన ప్రియుడిని వదిలిపెట్టలేక నరకయాతన అనుభవిస్తోంది. ప్రేమగా, అపురూపంగా చూసుకుంటున్న భర్తతో ఏ లోటూ లేదని చెప్పింది. కానీ, ప్రియుడితో ఆ సుఖం కోసం పరితపిస్తుందన్న విషయం ఆమె లేఖ ద్వారా తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి రాగా, తన సమస్యకు పరిష్కారం చూపించాలని ఆ మహిళ ఓ సైకాలజిస్ట్‌కు లేఖ రాసింది. ఈ లేఖ ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. 
 
'నేను 38 ఏళ్ల వయసున్న వివాహితను. నాకు పిల్లలు కూడా ఉన్నారు. ఫేస్‌బుక్‌లో యేడాది క్రితం ఓ వ్యక్తితో పరిచయమైంది. ఇప్పుడు నేను అతడితో ప్రేమలో పడ్డానని అనిపిస్తోంది. నాది పెద్దలు కుదిర్చిన వివాహం. నా భర్తతో ఎటువంటి సమస్యల్లేవు. అతను నన్ను ఎంతో ప్రేమగా, శ్రద్ధగా చూసుకుంటారు. కానీ, ఫేస్‌బుక్‌లో నాకు పరిచయమైన వ్యక్తి మాత్రం నిజంగా ప్రత్యేకం. నా భర్త దగ్గర నేను ఎప్పుడూ అలా ఫీలవ్వలేదు. ఒక్కరోజు అతడు నాతో మాట్లాడకపోయినా నాకు  పిచ్చెక్కినట్టు ఉంటుంది. మూడు నెలల క్రితం నేను అతడ్ని కేవలం ముద్దు పెట్టుకున్నాను. ఆ అనుభూతిని ఇప్పటికీ మర్చిపోలేకున్నాను. పెళ్లయిన 18 ఏళ్లలో నా భర్తతో నేను ఒక్కసారి కూడా ఇటువంటి అనుభవాన్ని చవిచూడలేదు. 
 
నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినదాన్ని. పెళ్లికి ముందు ఏ అబ్బాయితోనూ నేను సన్నిహితంగా మెలగలేదు. సంబంధాలు పెట్టుకోలేదు. కానీ ఫేస్‌బుక్‌లో పరిచయమైన వ్యక్తి నాలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు. అతడితో చాట్ చేసిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాను. కానీ, అదేసమయంలో నేను నా భర్తను కానీ, కటుంబాన్ని కానీ బాధపెట్టాలని అనుకోవడం లేదు. నా స్వార్థం కోసం భర్తను విడిచిపెట్టాలని అనుకోవడం లేదు. కానీ ప్రియుడితో నా ఫీలింగ్స్‌ను కూడా కంట్రోల్ చేసుకోలేను. నేను గందరగోళాన్ని ఎదుర్కొంటున్నా. నాకు దారి చూపండి’’ అంటూ ఆ వివాహిత మహిళ తాను ఎదుర్కొంటున్న పరిస్థితిని వెల్లడించింది. 

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments