యువత ఉన్నతశిఖరాలను అధిరోహించాలంటే?

Webdunia
బుధవారం, 3 ఫిబ్రవరి 2021 (22:55 IST)
నేటికాలంలో యోగ అంటే శరీర వ్యాయామమని అందరికీ అభిప్రాయం ఏర్పడిపోయింది. అందరూ అటువంటి శారీరక వ్యాయామము గురుంచి ఎంతో అభిరుచి చూపిస్తున్నారు. కాని నిజానికి యోగమనేది కేవలము శరీరానికే సంబంధించినది కాదు. అది ముఖ్యంగా మనస్సుకు  సంబంధించినది. మనస్సును నిగ్రహించడానికే మొట్టమొదటి యోగము, కచ్చితంగా యోగపద్ధతి ప్రవేశపెట్టబడింది. ఇది అనేక వేల సంవత్సరాల క్రిందటే జరిగింది.
 
మనిషి అస్తిత్వంలో నాలుగు అంశాలు ఉన్నాయి. అవి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ. మనషి ఈనాలుగింటిని ఆధారం చేసుకొని కర్మలు చేస్తాడు. మనిషి వీటిలో మూడవదైన బుద్ది ద్వారానే కార్యచరణ లేదా కార్యసాధన జరుగుతుంది. కాని మనస్సు చంచలత కారణంగా బుద్ధి గతితప్పి లక్ష్యసాధన తప్పిపోతుంది. అందుకే భగవద్గీతలో గీతచార్యుడు యోగానికి ఒక నిర్వచనాన్ని చెప్పాడు.
 
యోగః కర్మసు కౌశలమ్..
కర్మలో నేర్పరితనమే యోగము. యోగము ముసలివాళ్ళకు కానీ మాకెందుకు అని విద్యార్ధులు, యువత అనుకునే అవకాశం ఉంది. మనస్సుపై ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతైన అవసరము. ప్రస్తుత కాలంలో విద్యార్ధులకు మనస్సు ఏకాగ్రత ఎంతో అవసరం. ఒక విద్యార్ధి చదువులో నూటికి నూరుమార్కులు సాధిస్తున్నాడంటే మనస్సును నిగ్రహించే ఆ కార్యాన్ని సాధించాడని చెప్పవచ్చు.
 
సాధారణంగా యువత, విద్యార్ధులను తప్పుదోవ పట్టించేవి ఇంటర్నెట్, వాట్సప్ సంభాషణలు, ఫేస్ బుక్‌లో కాలం గడపడం, వీడియోలు చూడటం, మత్తుపదార్ధాలకు అలవాటు పడటం. ముఖ్యంగా లక్ష్యం లేకపోవడం. ఇవన్నీ చంచలమైన మనస్సు ద్వారా కలిగేవి. కాని ఏ విద్యార్ధియైనా చదువులో సంపూర్ణ విజయాన్నిసాధిస్తున్నాడంటే, మానసిక ప్రలోభాల నుండి అతడు బయటపడినట్లేనని తెలిసుకోవాలి. అప్పుడు అతడు పూర్తిగా బుద్ధిస్ధాయిలోనే ఉంటాడు.
 
అతడు సాధించలేని కార్యమే ఉండదు. విద్యార్ధులకు, యువతకు తమ కార్యరంగంలో రాణించడమే యోగమౌతుంది. మన లక్ష్యసాధనకు అడ్డుపడే మనస్సును నిగ్రహించుకోవాలి. మనస్సును నిగ్రహించడం వలన ఉన్నత స్థితిని చేరుకోగలం. కర్మలను తగ్గించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్‌లోఅనూహ్య పరిణామాలు : సీఎం పదవికి రాజీనామా చేయనున్న సిద్ధరామయ్య...?

నీటి హైసింత్ వల్ల ప్రభావితమైన నీటి వనరులు.. మహిళలకు జీవనోపాధి.. ఎలా?

తెలంగాణలో నో ఎబోలా.. విమానాశ్రయం, ఆస్పత్రుల్లో కట్టుదిట్టమైన నిఘా

కదిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గోపురంపై పిడుగు.. తిరుమలలో భారీ వర్షాలు

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. 20 ఏళ్ల యువకుడికి 20 జైలు శిక్ష

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దేశీ ప్రిన్సెస్‌'లా మెరిసిపోతున్న జాన్వీ కపూర్

Nani: 150 మిలియన్+ వ్యూస్ తో నాని ది ప్యారడైజ్ ఆయా షేర్ సాంగ్

Devi Sri Prasad: ఎల్లమ్మ చేయడానికి స్ఫూర్తిని ఇచ్చిన గ్రామం వెదురుపాక: దేవిశ్రీ ప్రసాద్

Karthi: ఈ ఏడాది చిత్రాల సందడితో 49వ పుట్టినరోజు జరుపుకుంటున్న కార్తి

కెమెరాతో కథ చెప్పాలి, రీ-రికార్డింగ్‌కి కూడా కథలో స్పేస్ ఉండాలి : కెమెరామెన్ రత్నవేలు

తర్వాతి కథనం
Show comments