Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం విష్ణుమూర్తిని పూజించేవారు మాంసాహారం తీసుకుంటే.....

దేవానుగ్రహం పొందాలంటే ఎప్పుడంటే అప్పుడు పూజలు చేయకూడదు. వారాలు, శుభదినాల్లో, శుభ ఘడియల్లో పూజలు చేయాలి. లేదా ప్రతి నిమిషం మనస్సులో దేవునిని స్మరించుకుంటే మంచిది. అంతేకానీ అశుభ ఘడియల్లో పూజలు చేయడం, వేళ కానీ వేళలో పూజలు చేయడం మంచిది కాదు. ఇక ఏయే వారాల

Webdunia
బుధవారం, 27 జూన్ 2018 (10:50 IST)
దేవానుగ్రహం పొందాలంటే ఎప్పుడంటే అప్పుడు పూజలు చేయకూడదు. వారాలు, శుభదినాల్లో, శుభ ఘడియల్లో పూజలు చేయాలి. లేదా ప్రతి నిమిషం మనస్సులో దేవునిని స్మరించుకుంటే మంచిది. అంతేకానీ అశుభ ఘడియల్లో పూజలు చేయడం, వేళ కానీ వేళలో పూజలు చేయడం మంచిది కాదు. ఇక ఏయే వారాల్లో ఏయే దైవాన్ని పూజించాలో తెలుసుకుని దాని ప్రకారం పూజలు చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చును. 
 
* ఆదివారం సూర్యదేవునిని పూజించాలి. 
* సోమవారం శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడిని పూజించాలి.
* మంగళవారాల్లో కుమార స్వామిని పూజిస్తే మంచిది. 
* బుధవారం శ్రీ కృష్ణుడిని, వేంకటేశ్వరుడు ఇలా విష్ణు మూర్తి అవతార మూర్తులను పూజించడం వలన సకలసంపదలు చేకూరుతాయి. 
* గురువారం - నవగ్రహాలు, రాఘవేంద్ర స్వామి, సాయిబాబాలను కొలువవచ్చును.
* శుక్రవారం - అమ్మవారిని పూజించడం ఉత్తమం. 
* శనివారాల్లో - విష్ణుమూర్తిని, నవగ్రహాలు, ఆంజనేయుడిని పూజించడం మంచిది.
 
ఇక ఆదివారం సెలవు దొరికింది కదా అని బాగా మాంసాహారం తీసుకునేవారు ఎంతో మంది ఉన్నారు. అలాగే సోమ, మంగళవారాలు వదిలి బుధవారం నాడు మాంసాహారం తీసుకుని తిరిగి గురు, శుక్ర, శనివారాలు బ్రేకిచ్చేవారూ ఉన్నారు. కొందరు మంగళ, శుక్రవారాలు మాంసాహారం ముట్టుకోరు. కొందరు గురు, శుక్ర, శనివారాలు ముట్టుకోరు. అయితే బుధవారం విష్ణువుకు ప్రీతికరమైన రోజు కావున ఆ రోజు మాంసాహారాన్ని తీసుకోవడం కాస్త తగ్గించుకోవడం మంచిది. 
 
అలవాటు పడిన వారు మెల్ల మెల్లగా ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిది. మాంసాహారం నెలకు రెండు సార్లు తీసుకోవడం ఉత్తమం. అంతేకానీ వారానికి మూడు సార్లకు మించి నాన్‌వెజ్ తీసుకుంటే ఆధ్యాత్మికంగానే కాకుండా సైన్స్ పరంగానూ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments