Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయంత్రం పూట దీపారాధన తరువాత... గోర్లు కత్తిరించడం చేస్తే...

శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీ, దేవతా పూజలోనైనా ఆవునేతి దీపం, నువ్వుల నూనెదీపం తప్పక వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీ దేవి

సాయంత్రం పూట దీపారాధన తరువాత... గోర్లు కత్తిరించడం చేస్తే...
, సోమవారం, 25 జూన్ 2018 (14:21 IST)
శని ఆరాధనలో ఆవనూనె దీపం వెలిగించాలి. రాహు, కేతు గ్రహ శాంతి కోసం అవిసెనూనెతో దీపారాధన చేయాలి. ఏ దేవీ, దేవతా పూజలోనైనా ఆవునేతి దీపం, నువ్వుల నూనెదీపం తప్పక వెలిగించాలి. దుర్గాదేవి, జగదాంబ, సరస్వతీ దేవి కృపకోసం రెండు ముఖాల దీపం వెలిగించాలి. గణపతి అనుగ్రహం కోసం మూడు వత్తుల దీపం వెలిగించాలి.
 
ఆర్థిక లాభాలను ఆశించేవారు నియమపూర్లకంగా ఇంట్లో లేదా దేవాలయంలో స్వచ్ఛమైన నేతిదీపం వెలిగించాలి. శత్రుపీడ విరగడ కోసం భైరవస్వామికి ఆవనూనె దీపం వెలిగించాలి. సూర్య భగవానుని ప్రసన్నం కోసం నేతి దీపం వెలిగించాలి. అలాగే దీపాలు పెట్టేవేల ఇంటికి ముందు తలుపులు తెరిచి ఉంచాలని, వెనక తలుపులు మూసి వెయ్యాలని, దీపాలు పెట్టాక గోర్లు కత్తిరించకూడదని, ఏడ్వకూడదని, తల దువ్వకూడదని, సంధ్య సమయం లోపలే ఇంటిని శుభ్రం చేసుకోవాలని, ఇలా అనేకంగా చెబుతుంటారు. అయితే ఇవన్ని ఎందుకు చెబుతారు అనేది చాలామందికి తెలియదు.
 
సాయంత్రం పూట జ్యేష్టాదేవి వెనుక ద్వారం నుండి, లక్ష్మీదేవి ముందు ద్వారం నుండి ఇంట్లోకి ప్రవేశిస్తారు. అందుకని సంధ్య సమయం లోపు వెనుక తలుపులను మూసివేసి ముందు తలుపులను తెరచి ఉంచాలి. దాని వలన జ్యేష్టా దేవి ఇంట్లోకి రాకపోగా లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. మన ఇంటికి ఎవరైన గెస్ట్ వస్తారు అంటేనే ఇంటిని శుభ్రంగా ఉంచి మనం కూడా శుభ్రంగా తయారై వాళ్ళు వచ్చే సమయం కోసం ఎదురుచూస్తుంటాం. 
 
అలాంటిది మన జీవితాలలో వెలుగును నింపడానికి ఆ లక్ష్మీ తల్లి వచ్చే సమయానికి మనం ఇంటిని శుభ్రపరచుకుని మనం కూడా శుభ్రంగా ఉండి ఆతల్లిని ఆహ్వానిస్తే వచ్చి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అంతేకాని లక్ష్మీదేవి వచ్చే సమయంలో గోర్లు కత్తిరించడం, తల దువ్వడం, ఏడ్వటం చేయకూడదని పండితులు చెప్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనీప్లాంట్‌ను ఈ దిశలో పెంచుకుంటే.. దంపతుల మధ్య గొడవలే...?