Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాదరస సాయిబాబా అనుగ్రహం..

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (13:55 IST)
పాదరసంతో తయారుచేసిన సాయిబాబా ఆరాధనను విశేషంగా చేయడం వలన బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఏ రకమైన విద్యనైనా సరే స్వయంగా ఇవ్వగల శక్తిమంతుడు బృహస్పతి. వీరి అనుగ్రహం ఉంటే మంచి విద్యాజ్ఞానం లభిస్తుంది. లేని ఎడల ఇబ్బందికరమైన విజ్ఞానమే.

జన్మ లగ్నంలో మూడవ ఇంట బృహస్పతి ఉంటే అది బాలారిష్టం. మిగిలిన గ్రహ బాలారిష్టముల కంటే గురువుతో వచ్చే బాలారిష్టములు అత్యంత ప్రమాదకరమయినవి. అందుకు కారణం ఆయన దేహ కారకుడు. దేహపుష్టికి కారకుడు.
 
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు, గురువు తృతీయంలో ఉండడం వలన వచ్చే బాలారిష్ట దోషం ఉన్నవారు పాదరస సాయిబాబాను పూజస్తే గురుగ్రహ అనుగ్రహం కలిగి గురుగ్రహ దోషపరిహారం జరుగుతుంది. పాదరస సాయిబాబాను గురువారం రోజు పూజామందిరంలో పసుపు బట్టపైన గాని పసుపు పొడి మీద గాని ప్రతిష్టించాలి.

ఓం సాయీశ్వరాయ విద్మహే షిరిడీశ్వరాయ ధీమహి తన్నో బాబా ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించాలి. ఈ మంత్ర జపానంతరం ధూప, దీప నైవేద్యాలతో హారతి ఇచ్చి సాయిబాబా విభూదిని నుదుట ధరించాలి. పూజా మందిరంలో నిత్య పూజ కొరకు పాదరస సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నైరుతి బంగాళాఖాతంలో తుఫాను.. తిరుమలలో భారీ వర్షాలు.. భక్తుల ఇక్కట్లు

కాబోయే భర్తతో అలా షికారుకు వెళ్లిన 20 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం

కార్మికులకు పింఛన్ కనీస మొత్తం రూ.7 వేలా? కేంద్ర మంత్రి ఏమంటున్నారు?

వీడియో గేమ్ డెవలప్‌మెంట్‌లో కెరీర్ మార్గాలు: లక్ష్య డిజిటల్ సాంకేతిక ముందడుగు

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త.. కొట్టి చంపేసిన భార్య.. ఆ తర్వాత కొడుకు ముందే..

అన్నీ చూడండి

లేటెస్ట్

భక్తులకు త్వరిత దర్శనం కోసం కృత్రిమ మేధస్సు.. అదంతా టోటల్ వేస్టంటోన్న ఎల్వీ

Shravan Somvar: శ్రావణ సోమవారం ఇలా పూజ చేస్తే సర్వం శుభం

03-08-2025 ఆదివారం ఫలితాలు - పందాలు, బెట్టింగుకు పాల్పడవద్దు...

03-08-2025 నుంచి 09-08-2025 వరకు మీ వార రాశి ఫలితాల

తర్వాతి కథనం
Show comments