Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వీళ్లు ఒకరిని మించి మరొకరు అశుభ కారకులు... ఎవరో తెలుసా..?

వీళ్లు ఒకరిని మించి మరొకరు అశుభ కారకులు... ఎవరో తెలుసా..?
, శనివారం, 8 డిశెంబరు 2018 (13:27 IST)
దిక్కులు - దిక్పాలకులు:
తూర్పు - ఇంద్రుడు
పడమర - వరుణుడు
దక్షిణం - యముడు
ఉత్తరం - కుబేరుడు
ఈశాన్యం - ఈశ్వరుడు
వాయవ్యం - వాయుదేవుడు
నైరృతి - నిరృతి (రాక్షస)
ఆగ్నేయం - అగ్నిదేవుడు
 
పై తెలిపిన దిక్పాలకులకు సహజ బలిమి ఇలా ఉంటుంది...
 
ఈశాన్యం: ఈశాన్య దిక్పతి, మృత్యుంజయుడు, సకల శుభకారకుడు, వంశోద్దీపకుడు - శివుడు.
ఉత్తరం: ఐశ్వర్య, భోగభాగ్యకారకుడు. సకల సంపత్కరుడు, ధనాధిపతి - కుబేరుడు. 
తూర్పు: క్షత్రియ సంభవుడు. దర్పం కీర్తి కారకుడు, రాజస గుణాధిక్యత గలవాడు - ఇంద్రుడు.
వాయవ్యం: అస్తిరత్వం ఎక్కువ. చంచలబుద్ధి. స్థాన భ్రష్ఠత్వం కలిగించే గుణం గలవాడు - వాయువు. 
పశ్చిమం: పాశంతో బంధించి, పురుషులకు తక్కువ సామర్ధ్యమిచ్చేవాడు - వరుణుడు.
ఆగ్నేయం: దురహంకారి, సర్వదగ్ధ సమర్ధుడు, ధనలేమి కారకుడు, రోగ కారకుడు కూడ - అగ్ని.
దక్షిణం: మృత్యు కారకుడు, వినాశకుడు, దరిద్ర కారకుడు, సమవర్తి, ధనహీనుడు - యముడు. 
నైరృతి: నర వాహనుడు, రాక్షసుడు, పీడా కారకుడు, రక్తపాన మత్తుడు, హింసా కారకుడు - నైరృతి.
 
పై ఎనిమిది దిక్కులలో మెుదటి మూడు దిక్పాలకులు శుభ కారకులు. అదే వరుస క్రమంలో ఒకరిని మించి మరొకరు అశుభ కారకులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-12-2018 - శనివారం మీ రాశిఫలితాలు - ఎప్పటినుండో వాయిదా పడిన పనులు...