Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనిదోష నివారణకు ఇలా చేస్తే..?

శనిదోష నివారణకు ఇలా చేస్తే..?
, గురువారం, 6 డిశెంబరు 2018 (11:11 IST)
కొందరైతే వృత్తి ఉద్యోగాల్లో ఎంతగా శ్రమిస్తున్నా ఉన్నతి సాధించలేకపోతుంటారు. మెరుగైన పనితీరు, చిత్తశుద్ధి వంటి లక్షణాలను కలిగి ఉన్నా తగిన పదోన్నతులు, వేతన ప్రతిఫలాలను పొందలేకపోతుంటారు. జాతకంలో శని అనుగ్రహం లోపించినప్పుడు, రాజ్యాధిపతి, రాజ్యభావం బలహీనపడినప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఈ సమస్య నుండి విముక్తి చెందాలంటే.. కొన్ని పరిహారాలు చేయవలసి ఉంటుంది. అవేంటో ఓసారి చూద్దాం..
 
ప్రతి నెల ఏదైనా గురువారం ఇంటికి దగ్గరగా ఉన్న ఆలయానికి వెళ్లి తీపి గుమ్మడికాయను సమర్పించాలి. అలాగే ఆలయ పూజారులకు లేదా పురోహితులకు వస్త్రదానం చేయాలి. ఇలా చేస్తే శని గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. అలానే మేనత్తలకు, అక్కచెల్లెళ్లకు చిన్నపాటివైనా కానుకలు ఇవ్వడానికి సందర్భాలతో నిమిత్తం లేదు. చదువుకోసం సాయం కోరే ఆడ పిల్లలకు ఆర్థిక సాయం చేస్తే మంచిది. 
 
ఆశలు వదలుకునిపోతున్న స్థితిలో గ్రహబలానికి మించి దైవబలం మిన్నగా పనిచేస్తుంది. కనుక ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారి కుడికాలి బొటనవేలి పై ఉన్న సింధూరాన్ని నుదుటిపై తిలకంగా పెట్టుకోవాలి. ఇలా ప్రతి మంగళవారం క్రమంగా హనుమంతుని ఆలయానికి వెళితే గ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. 
 
శని దేవునికి ప్రీతి కలిగించడం ద్వారా ఆశించిన ఫలితాన్ని సాధించవచ్చు. పదోన్నతులు, వేతన ప్రతి ఫలాలు ఆశించిన స్థాయిలో దక్కనందుకు నిరాశ అనిపించినా, కుంగిపోవద్దు. పనితీరుపై శ్రద్ధ తగ్గించవద్దు. చిత్తశుద్ధితో విధి నిర్వహణ కొనసాగిస్తూనే, శని ప్రీతికోసం ప్రతిరోజూ ఉదయం కాకులకు ఆహార పానీయాలను సమర్పించాలి. శనిదేవునికి కాకి అంతే పరమ ప్రీతి. కనుక ప్రతీ శనివారం నాడు కాకులకు పానీయాలు సమర్పించండి.. ఈతిభాదలు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

06-12-2018 గురువారం దినఫలాలు - బంధుమిత్రుల మధ్య సత్సంబంధాలు...