Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువారం హనుమంతుడి పూజ.. సుందరకాండ.. మినప్పప్పు గారెలు

సెల్వి
బుధవారం, 17 జనవరి 2024 (22:51 IST)
గురువారం హనుమంతుడి పూజ విశేష ఫలితాలను ఇస్తుంది. కలియుగంలో చిరంజీవి, శక్తి వంతుడైన హనుమంతుడిని గురువారం, మంగళవారం, శనివారం పూజించడం ద్వారా సమస్త దోషాలు తొలగిపోతాయి. ఈ రోజున శ్రీరామజయం మంత్రాన్ని 108 సార్లు రాసి మాలగా సిద్ధం చేసి ఆయనకు సమర్పించిన వారికి ఆర్థిక ఇబ్బందులు వుండవు. వ్యాపారాభివృద్ధి చేకూరుతుంది. 
 
హనుమంతుని పూజతో ‘సర్వమంగళ కార్యాను కూలం’ చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. హనుమంతుని పూజతో చాకచక్యంగా మాట్లాడే చాతుర్యాన్ని ప్రసాదిస్తాడు. తనని పూజించే భక్తులకు తన వద్ద ఉన్న అన్ని శక్తియుక్తులు మనస్సులో బలాన్ని ఏర్పరిచేలా చేస్తాయి. హనుమంతుడు వాయుపుత్రుడు కావున ఆయన గాలిలో కలిసి వుంటాడని.. పిలిచిన వెంటనే పలుకుతాడని చెప్తారు. ఇంకా రామనామ స్మరణ ఎక్కడ చేస్తారో అక్కడ హనుమంతుడు తప్పకుండా వుంటాడని ఐతిహ్యం. రామ అవతారం పూర్తైనా, ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవిగా ఉన్నారు. హనుమకు మినప్పప్పుతో చేసిన వడమాలను, తమలపాకుల మాలను, సింధూరాన్ని సమర్పించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. 
 
ఆంజనేయుని తోకకు శక్తి ఎక్కువని.. ఆ తోకకు చందనం, కుంకుమ బొట్టు ఉంచి 48 రోజులు వ్రతం చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. సమస్త దోషాలు తొలగిపోవాలంటే.. సుందర కాండను పారాయణం చేయడం మంచిది. 
 
ఇలా చేస్తే బాధలు తొలగిపోతాయి. బుద్ధికుశలత పెరుగుతుంది. కీర్తిప్రతిష్టలు చేకూరుతాయి. ఈ వ్రతంలో కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. శత్రుబాధ వుండదు. బంధువుల మధ్య స్నేహం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ మూల మంత్రాన్ని పఠించడం మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదు.. బాలికను కిడ్నాప్ చేశారు.. కానీ 2 గంటల్లోనే?

ప్రియుడితో ఏకాంతంగా లేడీ పోలీస్, భర్త వచ్చేసరికి మంచం కింద దాచేసింది

అమెరికా అదనపు సుంకాలు.. భారత్‌కు రిలీఫ్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

18న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు - 25న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, అలిపిరి మెట్ల మార్గం విశిష్టత ఏమిటి? (video)

14-08-2025 గురువారం మీ రాశి ఫలితాలు - శ్రమ అధికం, ఫలితం శూన్యం

Vishnu Sahasranama: నక్షత్రాల ఆధారంగా విష్ణు సహస్రనామ పఠనం చేస్తే?

13-08-2025 బుధవారం దినఫలాలు - పిల్లల విషయంలో మంచి జరుగుతుంది...

తర్వాతి కథనం
Show comments