Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మార్గశిర మాసంలో శ్రీవారిని పూజిస్తే ఫలితం ఏంటి?

venkateswara swamy

సెల్వి

, సోమవారం, 8 జనవరి 2024 (10:52 IST)
మార్గశిర మాసంలో  శ్రీవారిని పూజించటం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. వెంకన్నను పూజించడం పుణ్యం చేకూరుతుంది. రుణబాధలను దూరం చేస్తుంది. మార్గశిర శనివారాల్లో శ్రీవారిని పూజించడం ద్వారా రుణబాధలు తొలగిపోతాయి. శ్రీవారిని ఉదయం నిద్రలేచి శ్రీవారిని పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
మార్గశిర మాసంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం మంచిది. ఆ తరువాత, పూజా గదిలో దీపం వెలిగించి, 2 తులసి ఆకులు, 2 యాలకులు, 3 చిన్న పచ్చ కర్పూరం పసుపు వస్త్రంలో ఉంచి దేవుడిని ప్రార్థించాలి. శనివారం శ్రీవారి లేదా పెరుమాళ్ల ఆలయానికి వెళ్లి దీపం వెలిగించడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.  
 
శనివారం పూట సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నాన మాచరించి తులసికోట ముందు నేతితో గాని, నువ్వుల నూనెతో గానీ దీపమెలిగించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా తులసికోట ముందు దీపమెలిగిస్తే.. ఆ గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడు కొలువుంటుందని నమ్మకం.
 
అలాగే శనివారం సాయంత్రం పూట శ్రీమన్నారాయణుని ఆలయాన్ని సందర్శించుకుని నేతితో దీపమెలిగించుకునే వారికి ఈతిబాధలు తొలగిపోయి, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయని పురోహితులు చెబుతున్నారు.శనివారం చేసే హనుమంతుని పూజ సర్వ కామ్యార్ధ సిద్ధి కల్గిస్తుంది సకల శ్రేయస్సును ఇస్తుంది.
 
శనీశ్వరుడికి శనివారం పాలాభిషేకం చేయిస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. శనిదేవుని వలన బాధలు అనుభవిస్తున్న వారు, శనివారం నాడు శనీశ్వరాలయాల్లో గానీ, నవగ్రహమండపంలో గాని శ్రీ శనీశ్వరునికి అభిషేకం చేయడం మంచిది. అంతేకాకుండా నల్లని వస్త్రం, నల్లని నువ్వులు, నువ్వుల నూనె, మేకులు, ఇనుము, దర్భలు, బూరగదూది వంటివాటిని దానమివ్వడం మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

08-01-2024 సోమవారం దినఫలాలు - దేవి ఖడ్గమాల చదివిన లేక విన్నా శుభం...