Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ పటాన్ని పూజ గదిలో ఉంచుకోవచ్చా..?

Webdunia
శుక్రవారం, 8 మార్చి 2019 (13:08 IST)
పూజా మందిరాలలో శివ కుటుంబ చిత్రపటాన్ని ఉంచుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందికి కలుగుతుంటుంది. కొందరు చిత్ర పటాన్ని చూసి ఈ పటం ఉందేమిటి అని ప్రశ్నిస్తుంటారు. నిజానికి అసలు ఈ పటాన్ని పూజామందిరంలో ఉంచుకోవచ్చో లేదో వారికే తెలియదు. కానీ శివ కుటుంబంతో ఉన్న చిత్ర పటాన్ని పూజా మందిరంలో ఉంచడం చాలా మంచిదని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు. 
 
పార్వతీపరమేశ్వరులు లోకానికే తల్లిదండ్రులు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు. పరమేశ్వరుడు ఆయుష్షును ప్రసాదిస్తే, అమ్మవారు విజయాన్ని చేకూరుస్తుంది. తమ బిడ్డలను అనుగ్రహించడంలోను, ఆదరించడంలోను ఆ తల్లిదండ్రులు ఎంతమాత్రం ఆలస్యం చేయరు. ఇక వినాయకుడు తనని ప్రార్థించిన వారికి ఎలాంటి విఘ్నాలు ఎదురుకాకుండా చూస్తాడు. 
 
విద్యాభివృద్ధిని కలిగిస్తాడు. కుమారస్వామి తేజస్సును, చైతన్యాన్ని కలిగిస్తాడు. జ్ఞానాన్ని పెంచడమే కాకుండా సంతానాన్ని అనుగ్రహిస్తాడు. ఇలా పార్వతీపరమేశ్వరులు, వినాయకుడు, కుమారస్వామి కుటుంబంలోని వారికి ఆయురారోగ్యాలను, విజయాలను, జ్ఞానాన్ని, చైతన్యాన్ని కలిగిస్తారు. అందువలన వాళ్లంతా కలిసి వున్న శివ కుటుంబ చిత్రపటం పూజా మందిరంలో ఉండటం చాలా మంచిదని అంటారు.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

తర్వాతి కథనం
Show comments