మీ భాగస్వామి మిమ్మల్ని పొగిడితే.. ఎలా స్వీకరిస్తున్నారు?

జీవిత భాగస్వామి మేలు కోరుకోవడం.. వారి బాగోగులు చూడటం.. వారి జీవితాంతం సంతోషంగా ఉంచుకోవడమే నిజమైన దాంపత్యం అంటారు. ఒకరికొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా జీవితం సాగించాలంటే భాగస్వాములు ముందుగా జీవితమంటే

Webdunia
గురువారం, 24 నవంబరు 2016 (14:07 IST)
జీవిత భాగస్వామి మేలు కోరుకోవడం.. వారి బాగోగులు చూడటం.. వారి జీవితాంతం సంతోషంగా ఉంచుకోవడమే నిజమైన దాంపత్యం అంటారు. ఒకరికొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా జీవితం సాగించాలంటే భాగస్వాములు ముందుగా జీవితమంటే ఏంటని తెలుసుకోవాలి. డబ్బే ప్రధానం కాదని గుర్తించాలి.

సంబంధాలకు విలువ ఇవ్వాలి. సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండేందుకు ప్రతి క్షణం తపించిపోయే వారు చాలామంది ఉంటారు. ఇందుకోసం ఉద్యోగాలకు పరుగులు తీసేవారూ అనేకమంది ఉంటారు. అయితే డబ్బు కోసం శ్రమను దానం చేయవచ్చు కానీ.. సంతోషాన్ని దూరం చేసుకోకూడదంటున్నారు.. మానసిక నిపుణులు. 
 
ఆర్థిక ఇబ్బందులున్నా.. భాగస్వామి పట్ల అయిష్టంగా ఉండకుండా.. వారిని ప్రోత్సాహిస్తూ, నొచ్చుకునేలా మాట్లాడకుండా.. వారికి అర్థమయ్యేట్లు ప్రశాంతంగా మాట్లాడితే సమస్యలు అవంతట అవి తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలు భాగస్వామి పొగుడుతుంటే అపార్థం చేసుకుంటారు. వెటకారంగా మాట్లాడుతున్నాడేమోనని అనుకుంటారు. నువ్వు ఈ రోజు అందంగా ఉన్నావని చెప్తే.. అంటే.. అసలే చిరాగ్గా ఉంది.. నువ్వింకా వెటకారంగా మాట్లాడకు అంటూ అసహనం వ్యక్తం చేస్తారు. 
 
ఇలా అసహనం వ్యక్తం చేస్తే... ప్రశంసలు వారి మనసు నుంచి వచ్చినవి అయి ఉంటే వారు నొచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మీ భాగస్వామి ఎప్పుడైనా పొగిడితే, ఆ పొగడ్తను మనసారా స్వీకరించండి. సందర్భాన్ని బట్టి మీరూ మీ శ్రీవారిపై పొగడ్తల వర్షం కురిపించండి. ఇలా చేస్తే మీ మధ్య చనువు, అనురాగం రెట్టింపవడానికి ఎక్కువ సమయం పట్టదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

అవినీతి అధికారులను పట్టిస్తే రూ.లక్ష రివార్డు : సీఎం విజయ్ వెల్లడి

కుమార్తెతో సన్నిహితంగా ఉంటున్నాడనీ యువకుడిని చంపి ముక్కలు చేసిన దంపతులు

అసలే ఎండలు.. చాలదన్నట్లు ఏపీ గోదావరి జిల్లాల్లో తాగునీటి కొరత.. అలా చేయకపోతే..?

అమరావతి: స్మార్ట్ క్యాపిటల్ సిటీ కార్యక్రమాలు.. గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్ధుతాం..

Medical Shops: తెలంగాణలో మెడికల్ షాపుల బంద్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sunil Narang: తెలంగాణ వర్సెస్ ఆంధ్రా గా ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ వుందా?

NBK111 : నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని చిత్రంలో మనోజ్ మంచు

Manchu Manoj: వడ్డీ కాసుల వాడ గా రాబోతున్న మంచు మనోజ్

Chiru: స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ ఎం. రుషికి అభినందనగా ల్యాప్‌టాప్ బహుకరించిన చిరంజీవి

ఇండస్ట్రీలో చెడు వాతావరణం కనిపించలేదు : పురుష: చిత్ర నిర్మాత కోటేశ్వరరావు

తర్వాతి కథనం
Show comments