Webdunia - Bharat's app for daily news and videos

Install App

5-08-2018 నుండి 11-08-2018 వరకు మీ వార రాశి ఫలితాలు(Video)

కర్కాటకంలో రవి, వక్రి బుధ, రాహువులు, కన్యలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజ, కేతువులు. మేష, వృషభ, మిధున, కర్కాటకంలో చంద్రుడు. 7న సర్వ ఏకాదశి, 10న మాస శివరాత్రి.

Webdunia
శనివారం, 4 ఆగస్టు 2018 (16:05 IST)
కర్కాటకంలో రవి, వక్రి బుధ, రాహువులు, కన్యలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజ, కేతువులు. మేష,  వృషభ, మిధున, కర్కాటకంలో చంద్రుడు. 7న సర్వ ఏకాదశి, 10న మాస శివరాత్రి.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. పరిచయాలు బలపడుతాయి. మీ జోక్యం అనివార్యం. దంపతులకు కొత్త ఆలోచనలు స్పురిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు భారమనిపించవు. మానసికంగా కుదుటపడుతారు. ఆహ్వానం, కీలక పత్రాలు అందుతాయి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదుర్కుంటారు. సంతానం చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఊహించని సంఘటనలెదురవుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
వ్యవహారాల్లో ప్రతికూలతలు తొలగుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నోటీసులు, పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధనం మితంగా వ్యయం చేయండి. అనవసరి జోక్యం తగదు. పనులు చురుకుగా సాగుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఆది, సోమ వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు. వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమిస్తారు. మీ పథకాలు సత్పలితాలిస్తాయి. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. అధికారులకు ధనప్రలోభం తగదు. ఆందోళన కలిగించే సంఘనలెదురవుతాయి.   
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి సారిస్తారు. మీ శ్రీమతి అసహనం కలిగిస్తుంది. వ్యవహారాల్లో ప్రతికూలతలెదుర్కుంటారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆత్మీయుల కలయికతో కుదుటపడుతారు. పనులు మందకొడిగా సాగుతాయి. మంగళ, బుధ వారాల్లో సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులు తారసపడుతారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణం తలపెడుతారు.  
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గురు, శుక్ర వారాల్లో ప్రత్యర్థులతో జాగ్రత్త. నమ్మకస్తులై మోసగించేందుకు యత్నిస్తారు. ఆర్థికలావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొన్ని ఇబ్బందుల నుండి బయటపడుతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో పనులు పూర్తి కాగలవు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను సున్నితంగా తెలియజేయండి. సంతానం చదువులపై దృష్టి పెడతారు. ప్రియతముల ఆరోగ్యం కుదుటపడుతుంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. విమర్శలు ఉద్రేకపరుస్తాయి. సౌమ్యంగా మెలగండి. ఎవరినీ నిందించవద్దు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు రూపొందించుకుంటారు. అంచనాలు ఫలించవు. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. శనివారం నాడు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. క్రమంగా పుంజుకుంటాయి. నష్టాల నుండి బయటపడుతారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. వాహనచోదకులకు దూకుడు తగదు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కొత్త పనులు ప్రారంభిస్తారు. అపరిచితులను నమ్మవద్దు. ఆచితూచి అడుగేయండి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. శుభవార్తలు వింటారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ఖర్చులు అధికం, ధనానికి లోటుండదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. మంగళ, బుధ వారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. బంధువుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. ఉద్యోగస్తులు అధికారులను ఆకట్టుకుంటారు. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. షాపు పనివారలతో జాగ్రత్త. ముఖ్యమైన పత్రాలు అందుతాయి.  
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఖర్చులు అంచనాలను మించుతాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. కష్టమనుకున్న పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఆత్మీయులను కలుసుకుంటారు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వ్యవహారానుకూలత ఉంది. గత అనుభవంతో జాగ్రత్త వహిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. మంగళ, బుధ వారాల్లో పరిచయస్తుల ఆకస్మిక రాక ఇబ్బంది కలిగిస్తుంది. సంతానం అత్యుత్సాహం ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. అధికారులకు హోదామార్పు, స్ధానచలంనం. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.  
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
శుభకార్యం నిశ్చయమవుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ మాటకు ఎదురుండదు. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందులు తొలుగుతాయి. అనేక పనులతో సతమతమవుతారు. బాధ్యతలు అప్పగించవద్దు. నగదు, పత్రాలు జాగ్రత. కొత్త పరిచయాలేర్పడుతాయి. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆది, సోమ వారాల్లో ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. గృహంలో మార్పుచేర్పులు చేపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. నష్టాలు, ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. వివాదాలు సద్దుమణుగుతాయి. ప్రయాణం కలిసివస్తుంది.   
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
బాధ్యతగా వ్యవహరించాలి. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టమ్మీద నెరవేరుతాయి. మంగళ, శని వారాల్లో శకునాలు, విమర్శలు పట్టించుకోవద్దు. పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. అనవసర విషయాలకు దూరంగా ఉండాలి. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆహ్వానం అందుకుంటారు. విలువైన పత్రాలు, వస్తువులు జాగ్రత్త. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నం సాగించండి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. విదేశీ విద్యాయత్నం ఫలించదు.
 
మకరం: ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధనలాభం ఉంది. రుణ విముక్తులవుతారు. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తవుతాయి. వివాహానికి యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. మెుహమ్మాటాలు, ఒత్తిళ్లకు లొంగవద్దు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. గురు, శుక్ర వారాల్లో గత సంఘటనలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఉద్యోగస్తులు బాధ్యతగా వ్యవహరించాలి. అధికారుల తీరును గమనించండి. వివాదాలు, కోర్టు వాయిదాలు చికాకుపరుస్తాయి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. ఒక ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. పరిచయాలు బలపడుతాయి. పదవులు, బాధ్యతల నుండి తప్పకుంటారు. వ్యవహారాల్లో ప్రతికూలతలు అధికం. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఒత్తిడి, ఆందోళన అధికం. శనివారం నాడు ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనుల సానూకూలతకు మరింత శ్రమించాలి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యం కాదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్పలితాలిస్తాయి. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. ఖర్చులు సంతృప్తికరం. ఆత్మీయులకు సాయం అందిస్తారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. గృహంలో స్తబ్ధత తొలుగుతుంది. సంతానం దూకుడును అదుపు చేయండి. ఊహించని సంఘటనలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత ఉండదు. సౌమ్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. దైవకార్య సమావేశాల్లో వాహనం నడిపేటపుడు జాగ్రత్త. వీడియో చూడండి...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

లేటెస్ట్

Pisces : మీనరాశికి 2025 కలిసొస్తుందా? యోగ బలం.. శివారాధన, హనుమాన్ చాలీసాతో..?

Aquarius : కుంభం.. 2025 రాశి ఫలితాలు.. శ్రీమన్నారాయణ స్తోత్రపారాయణం చేస్తే?

మకర రాశి 2025 ఫలితాలు.. సుబ్రహ్మణ్యేశ్వరునికి అర్చన చేస్తే?

Sagittarius 2025: ధనుస్సు రాశికి 2025 ఎలా వుంటుంది? విష్ణుసహస్రనామ పారాయణ చేస్తే?

Karthika Deepam 2025: 365 వత్తులతో దీపాన్ని వెలిగిస్తే?

తర్వాతి కథనం
Show comments