Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జూన్ 3 నుంచి 9 జూన్ 2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)

వృషభంలో రవి, బుధుడు, మిధునంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. మకర, కుంభ, మీన, మేషంలో చంద్రుడు. 8న శుక్రుడు కర్కాటకం ప్రవేశం.

Advertiesment
జూన్ 3 నుంచి 9 జూన్ 2018 వరకూ మీ వార రాశి ఫలితాలు(Video)
, శనివారం, 2 జూన్ 2018 (21:17 IST)
వృషభంలో రవి, బుధుడు, మిధునంలో శుక్రుడు, కర్కాటకంలో రాహువు, తులలో వక్రి బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో కుజ, కేతువులు. మకర, కుంభ, మీన, మేషంలో చంద్రుడు. 8న శుక్రుడు కర్కాటకం ప్రవేశం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
సంప్రదింపులు అనుకూలం. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సహాయం, సలహాలు ఆశించవద్దు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ప్రకటనలు, దళారుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. గురు, శుక్రవారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. అధికారులకు కొత్త బాధ్యతలు, విశ్రాంతి లోపం. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూరాన ఉన్న ప్రియతముల క్షేమం తెలుసుకుంటారు.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు
గృహమార్పు కలిసివస్తుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో వ్యవహరించండి. ఆరోగ్యం సంతృప్తికరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయంచేస్తారు. శనివారం నాడు పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. సంస్థల స్థాపనలకు వనరులు సర్దుబాటవుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు కొలిక్కివస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు.
 
మిథునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి. యత్నాలను విరమించుకోవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు విపరీతం. ఆది, సోమవారాల్లో ధనమూలక సమస్యలెదురవుతాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. పోగొట్టుకున్న పత్రాలు తిరిగి పొందుతారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నష్టాలను భర్తీ చేసుకోగల్గుతారు.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష 
పరిచయాలు, బంధుత్వాలు బలపతాయి. మీ మాటకు స్పందన లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. వైద్యపరీక్షలు చేయించుకోవటం ఉత్తమం. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. పనులు మెుండిగా పూర్తిచేస్తారు. సంతానం చదువులపై దృష్టిసారిస్తారు. విద్యా ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మంగళ, బుధవారాల్లో ఫోన్ సందేశాలకు స్పందించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు అమలుచేస్తారు. చిరువ్యాపారులకు ఆశాజనకం. జూదాలు, బెట్టింగ్‌ల వల్ల చిక్కులు తప్పవు.
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. కార్యానుకూలత, ధనలాభం ఉన్నాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. ఆది, సోమవారాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. విలాస వస్తువులు అమర్చుకుంటారు. మీ జోక్యం అనివార్యం. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. పనుల్లో ఒత్తిడి అధికం. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఉద్యోగస్తులకు శుభవార్తా శ్రవణం. ప్రశంసలు, సత్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కోర్టు వాయిదాలకు హాజరవుతారు.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు 
ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. ధనలాభం ఉంది. అవసరాలు నెరవేరుతాయి. వాగ్ధాటితో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ప్రేమానుబంధాలు బలపడతాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. అనేక పనులతో సతమతమవుతారు. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యంకాదు. ఊహించని సంఘటనలెదురవుతాయి. మంగళ, శనివారాల్లో చెప్పుడు మాటలు పట్టించుకోవద్దు. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పెట్టుబడులకు అనుకూలం. వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆశావహ దృక్పథంతో ఉద్యోగయత్నం సాగించండి. విద్యా ప్రకటనల పట్ల అవగాహన ప్రధానం. ప్రయాణం తలపెడతారు.
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు 
కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. యత్నాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. గురు, శుక్రవారాల్లో పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఖర్చులు వివరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులతో సమస్యలు తలెత్తుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. వృత్తుల వారి ఆదాయం మెరుగుపడుతుంది. వివాదాలు పరిష్కారదిశగా సాగుతాయి.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం, అనూరాధ, 
ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సాయంచేసేందుకు అయినవారే సందేహిస్తారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. వ్యవహారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. నమ్మిన వారే తప్పుదారి పట్టిస్తారు. ఆది, సోమవారాల్లో మీ గౌరవానికి భంగం కలుగవచ్చు. గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. పనులు సాగక విసుగు చెందుతారు. ఆప్తుల కలయిక ఉవశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య దాపరికం తగదు. ఒకరికి సలహా ఇచ్చి మరొకరికి వ్యతిరేకులవుతారు. కీలక పత్రాలు అందుకుంటారు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వాహన చోదకులకు దూకుడు తగదు.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరషాడ 1వ పాదం 
ఈ వారం అనుకూల పరిస్థితులున్నాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. సంప్రదింపులకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. అప్రియమైన వార్త వినవలసి వస్తుంది. పనులు హడావుడిగా సాగుతాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ సాధ్యం కాదు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చులుంటాయి. పొదుపు మూలానా ధనం అందుతుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంభవం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. సంతానం విదేశీ చదువులపై దృష్టి సారిస్తారు. ప్రకటనలు, దళారులను విశ్వసించవద్దు. ప్రతివిషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. గృహమార్పు కలిసివస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారాలు ఊపందుకుంటా. ఉపాధ్యాయులకు మార్పులు అనకూలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తుల వారికి పురోభివృద్ధి.
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటాబయటా అనుకూలతలున్నాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ వహిస్తారు. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ధనానికి ఇబ్బంది ఉండదు. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ జోక్యం అనివార్యం. పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరం. సొంత వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు అనుకూలం వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి.
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ఆదాయవ్యయాలు సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. నిర్ధిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. గుట్టుగా యత్నాలు సాగించండి. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. పరిచయం లేనివారితో జాగ్రత్త. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. ఆది, సోమవారాల్లో ఒత్తిడి, శ్రమ అధికం. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. గృహమార్పు ఏమంత అనుకూలం కాదు. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. నోటీసులు అందుకుంటారు. లైసెన్స్‌ల రెన్యువల్‌లో అలక్ష్యం తగదు.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంప్రదింపులు అనుకూలం. ఆందోళన తొలగి కుదుటపడతారు. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక వ్యవహారంలో ధనం అందుతుంది. ఖర్చులు పర్వాలేదనిపిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం ద్వారా శుభవార్త వింటారు. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. మంగళ, బుధవారాల్లో వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. ఉద్యోగస్తులకు పదవీయోగం, ధనలాభం. అధికారులకు హోదామార్పు, పనిభారం. విందులు వేడుకల్లో పాల్గొంటారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. వివాదాలు సద్దుమణుగుతాయి. పుణ్యకార్యం చేస్తారు. వీడియో చూడండి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈశాన్యము లోపించినట్లైతే ఏం జరుగుతుందో తెలుసా?