Webdunia - Bharat's app for daily news and videos

Install App

శనివారం ఈ శ్లోకం... 18సార్లు ప్రదక్షణ.. నేతితో దీపం చాలు..

Webdunia
శుక్రవారం, 24 జులై 2020 (18:57 IST)
"అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవకిమ్ వద
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో" అనే శ్లోకాన్ని శనివారం పూట పఠిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. అలాగే శనివారం ఉదయం నిష్ఠతో సుందరకాండ పారాయణం చేయడం.. శ్రీ వేంకటేశ్వర స్వామిని స్తుతించడం ద్వారా శనిదోషాలు తొలగిపోతాయి. రాహు దోషాలు పటాపంచలు అవుతాయి. 
 
అలాగే శనివారం పూట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద నేతితో దీపమెలిగించే వారికి సకలసంపదలు చేకూరుతాయి. ఇంకా ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున హనుమంతునిని ప్రార్థిస్తే.. ఈతిబాధలు వుండవని పండితులు అంటున్నారు. రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయుడిని సింధూరంతో అర్చించడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. 
 
ప్రతి మాసంలో వచ్చే అమావాస్య రోజున నిష్టతో ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకోవడం ద్వారా అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. అందుచేత అమావాస్య సాయంత్రం పూట మహిళలు, పురుషులు ఆంజనేయ స్వామికి నేతితో దీపమెలిగించి.. హనుమంతుడి ఆలయాన్ని 18 సార్లు ప్రదక్షిణ చేయడం ద్వారా మనోధైర్యం, సకలసంపదలు, ఉన్నత పదవులు లభిస్తాయని పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

16-03-2025 ఆదివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

దురదృష్టం పరుగెడుతున్నా పట్టుకునేది ఇలాంటివారే

తర్వాతి కథనం
Show comments