Webdunia - Bharat's app for daily news and videos

Install App

19-08-2018 నుండి 25-08-2018 వరకు మీ వార రాశి ఫలితాలు

కర్కాటకంలో బుధ, రాహువులు, సింహంలో రవి, కన్యలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజుడు, రాహువు. 19న బుధుని వక్రతాగ్యం. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభంలలో చంద్రుడు. 22న మత త్రయ ఏకా

Webdunia
శనివారం, 18 ఆగస్టు 2018 (22:42 IST)
కర్కాటకంలో బుధ, రాహువులు, సింహంలో రవి, కన్యలో శుక్రుడు, తులలో బృహస్పతి, ధనస్సులో వక్రి శని, మకరంలో వక్రి కుజుడు, రాహువు. 19న బుధుని వక్రతాగ్యం. వృశ్చిక, ధనస్సు, మకర, కుంభంలలో చంద్రుడు. 22న మత త్రయ ఏకాదశి, 24న వరలక్ష్మీ వ్రతం. ముఖ్యమైన పనులకు త్రయోదశి, శుక్రవారం అనుకూలం.
 
మేషం: అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం
ఖర్చులు అధికం, దైవకార్యాలకు వ్యయం చేస్తారు. పొదుపు మూలక ధనం అందుతుంది. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వేడుకల్లో పాల్గొంటారు. గృహం సందడిగా ఉంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పరిచయాలు బలపడుతాయి. సంప్రదింపులకు అనుకూలం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. పెద్దల సలహా పాటించండి. ఆభరణాలు, నగదు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. ఆది, సోమ వారాల్లో అవగాహనలేని విషయాలకు దూరంగా ఉండాలి. ఆశ్చర్యకరమైన సంఘటనలెదురవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం. ప్రశంసలు అందుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. చామంతి పూలతో అమ్మవారి ఆరాధన శుభం, జయం.
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆత్మీయులను వేడుకులు, విందులకు ఆహ్వానిస్తారు. ఖర్చులు విపరీతం. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. వ్యవహారాల్లో మీదే పైచేయి. చిత్తశుద్ధిని చాటుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెంపొందుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనులు వేగవంతమవుతాయి. అపరిచితుల వలన మోసపోయే ఆస్కారం ఉంది. మంగళ, బుధ వారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. అవివాహితులు కొత్త అనుభూతికి లోనవుతారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కార్యసిద్ధికి అమ్మవారిని గులాబి, కనకాంబరాలతో పూజించండి.
 
మిధునం: మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
స్వయంకృషితో రాణిస్తారు. బాధ్యతగా మెలగాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. అవసరాలకు ధనం అందుతుంది. దైవకార్యాలు, విందుల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలేర్పడుతాయి. శ్రమాధిక్యతతో పనులు పూర్తిచేస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఆది, గురు వారాల్లో దంపతుల మధ్య అవగాహన లోపం. అనునయంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. అవివాహితుల్లో ఉత్సాహం నెలకొంటుంది. సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. నిర్మాణాలు, మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. కోర్టు వాయిదాలు చికాకు పరుస్తాయి. గన్నేరు, తెల్లని పూలతో అమ్మవారి ఆరాధన శుభదాయకం.
 
కర్కాటకం: పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. మంగళ, శని వారాల్లో ప్రముఖఉల కలయిక సాధ్యం కాదు. సంతానం అత్యుత్సాం ఇబ్బంది కలిగిస్తుంది. వేడుకలకు హాజరవుతారు. బంధువుల ఆతిధ్యం సంతృప్తినిస్తుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. సంప్రదింపులకు అనుకూలం. కొంత మెుత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. వాణిజ్య ఒప్పందాలకు అనుకూలం. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. ప్రయాణం కలిసివస్తుంది. మార్కెట్ రంగాలవారి లక్ష్యాలను అధిగమిస్తారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. కార్యసిద్ధికి కలువలు, తామర పూలతో అమ్మవారిని పూజించండి. 
 
సింహం: మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
గృహం సందడిగా ఉంటుంది. ఆహ్వానం అందుకుంటారు. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. దైవకార్యాలకు బాగా వ్యయం చేస్తారు. ఆకస్మికంగా కొన్ని పనులు పూర్తవుతాయి. పెద్దల ఆరోగ్య కుదుటపడుతుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. రుణబాధలు తొలుగుతాయి. ఖర్చులు సంతృప్తికరం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వాహనయోగం, ధనలాభం ఉన్నాయి. సంప్రదింపులు అనుకూలం. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. గురు, శుక్ర వారాల్లో కొత్త సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. అనాలోచితంగా వ్యవహరించవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. చిరువ్యాపారుల ఆదాయం బాగుంటుంది. ప్రయాణంలో అప్రమత్తంగా ఉండాలి. అమ్మవారిని పున్నాగ పూలతో పూజించిన ప్రశాంతత, పురోభివృద్ధి.
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రేమానుబంధాలు బలపడుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. శనివారం నాడు పనులు హడావుడిగా సాగుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. మీ ఇష్టాయిష్టాలను సున్నితంగా వ్యక్తం చేయండి. ఎవరినీ నొప్పించవద్దు. పెద్దల ప్రమేయంతో ఒక సమస్య సానుకూలతమవుతుంది. శుభవార్తలు వింటారు. కష్టం ఫలిస్తుంది. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. పరిచయాలు బలపడుతాయి. ఖర్చులు సంతృప్తికరం. దైవకార్యానికి బాగా వ్యయం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు విస్తరణలకు అనుకూలం. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి. అధికారులకు సాదర వీడ్కోలు పలుకుతారు. ఉన్నత విద్యాయత్నంలో సమస్యలెదురవుతాయి. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. చామంతి, గరుడవర్ధని పూలతో అమ్మవారి ఆరాధన శుభదాయకం. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
వ్యవహారా ఒప్పందాల్లో మీదై పైచేయి. శుభకార్యంలో పాల్గొంటారు. అత్యుత్సాహం ప్రదర్శించవద్దు. మీ మాటతీరు వివాదాస్పదమవుతుంది. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. సంప్రదింపులు వాయిదా పడుతాయి. ఆర్థికలావాదేవీలు పురోగతిన సాగుతాయి. ఖర్చులు విపరీతం. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. పనులు చురుకుగా సాగుతాయి. ఆత్మీయులను ఆహ్వానిస్తారు. ప్రముఖఉల సందర్శనం వీలుకాదు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉపాధి పథకాల్లో స్థిరపడుతారు. మల్లెలు, కనకాంబరాలతో అమ్మవారి అర్చన కలిసిరాగలదు.
 
వృశ్చికం: విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట
ఈ వారం ఖర్చులు అంచనాలను మించుతాయి. దైవకార్యానికి బాగా వ్యయం చేస్తారు. వ్యవహారాలు మీ చేతుల మీదుగా సాగుతాయి. ఆత్మీయులకు చక్కని సలహాలిస్తారు. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిధ్యం ఆకట్టుకుంటుంది. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. అపరిచితులను విశ్వసించవద్దు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆందోళన తొలగి కుదటపడుతారు. అప్రమత్తంగా మెలగండి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. గృహంలో మార్పచేర్పులు చేపడుతారు. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. అధికారులకు కొత్త బాధ్యతలు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో పురోభివృద్ధి, అనుభవం గడిస్తారు. చామంతి, కనకాంబరాలలో అమ్మవారి ఆరాధన శుభదాయకం.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ 1వ పాదం
ఆశావహ దృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. సలహాలు, సహాయం ఆశించవద్దు. ఖర్చులు అధికం, రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. శుభకార్యంలో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ సంతృప్తినిస్తుంది. లక్ష్యసాధనకు కృషి, పట్టుదల ముఖ్యం. ఆది, సోమ వారాల్లో ప్రతికూలతలెదురవుతాయి. పరిస్థితులు అనుకూలించవు. పనుల ప్రారంభంలో చికాకులెదురవుతాయి. ప్రముఖులను కలిసినా ఫలితం ఉండదు. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో ఆటంకాలను దీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. పెట్టుబడుల సమాచారం అందుతుంది. ప్రస్తుల వ్యాపారాలే శ్రేయస్కరం. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. విదేశీ విద్యాయత్నం ఫలించదు. వ్యవహారానుకూలతకు అమ్మవారిని గులాబీలు, చామంతులతో పూజించండి. 
 
మకరం: ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిలబడదు. సన్నిహితుల సాయం అందుతుంది. మానసికంగా కుదుటపడుతారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల వైఖఱి నిరుత్సాహపరుస్తుంది. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. మంగళ, బుధ వారాల్లో శ్రమించినా ఫలితం ఉండదు. మలో నిస్తేజం చోటు చేసుకుంటుంది. ఆలోచనలు చికాకు పరుస్తాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఈ ఇబ్బందులు తాత్కాలికమై. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. దంపతులు అవగాహనతో మెలగాలి. మీ ఆగ్రహావేశాలను అదుపులో ఉంచుకోండి. సంతానం ఉన్నత చదువుల కోసం మరింతగా శ్రమించాలి. వ్యాపారులు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వృత్తుల వారికి సామాన్యం. అమ్మవారిని పున్నాగ పూలతో పూజించిన మనోవాంఛలు సిద్ధిస్తాయి. 
 
కుంభం: ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
సంప్రదింపులు కొలిక్కివస్తాయి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. కుటుంబీకుల సలహా పాటించండి. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. పెట్టుబడులకు సమయం కాదు. గృహమార్పు కలసివస్తుంది. అనుకూల పరిస్థితులున్నాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఆందోళన తొలగి కుదుటపడుతారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. గురు, శుక్ర వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. విందులు, వేడుకల్లో పాల్గొంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు కష్టకాలం. ఉద్యోగస్తులకు అధికారులతో సమస్యలెదురవుతాయి. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. సరుకు నిల్వలో జాగ్రత్త. విదేశీ విద్యాయత్నం నిరుత్సాహ పరుస్తుంది. తెల్లని పూలు, చామంతులతో అమ్మవారి అర్చన శుభదాయకం.
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
పదవుల కోసం తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ధనలాభం, వస్త్రప్రాప్తి, వాహనం యోగం ఉన్నాయి. గృహం సందడిగా ఉంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఖర్చులు విపరీతం. ఆభరణాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. శనివారం నాడు గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా గుర్తుంచుకోండి. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి అవసరం. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కంప్యూటర్ రంగాలవారికి ఆదాయాభివృద్ధి. సన్మాన, సాహిత్య సభల్లో పాల్గొంటారు. పూర్వ విద్యార్థుల కలయిక సంతోషపరుస్తుంది. సంకల్ప సిద్ధికి అమ్మవారిని చామంతులు, మల్లెలతో పూజించండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

అన్నీ చూడండి

లేటెస్ట్

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

Baba Vanga Predictions: బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?

మీనరాశి ఉద్యోగ జాతకం 2025.. చన్నా దాల్, పసుపు ఆవాలు..?

ధనుస్సు 2025 జాతకం.. కుటుంబ సౌఖ్యం.. మంచంపై నెమలి ఈకలు

తర్వాతి కథనం
Show comments