ఆవు నెయ్యితో సింధూరం కలిపి గణేశునికి తిలకం దిద్దితే..? (video)

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (05:00 IST)
బుధవారం, గణేశుడి ఆరాధనతో జ్ఞానం, సంపద లభిస్తుంది. బుధవారం, గణపతిని గరికతో పూజించడం ద్వారా సంపద, సుఖసంతోషాలు చేకూరుతాయి. ప్రతి బుధవారం గణేశునికి ఐదు గరికలను అర్పించడం ద్వారా జ్ఞానం పెరుగుతాయి. అలాగే, ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. బుధవారం పూట గణేశునికి ఆవు నెయ్యిలో సింధూరం కలిపిన తిలకాన్ని రాయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. 
 
గణేష్ గాయత్రీ మంత్రాన్ని బుధవారం కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేస్తే విఘ్నాలు తొలగిపోతాయి. జ్ఞానానికి దేవుడైన గణేశుడిని బుధవారం పూజించడం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి. బుధవారం గణేషును ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు వస్తుంది. అలాగే, ఈ రోజున గణేషునిని ఆరాధించే ముందు, మోదకాలను సమర్పించాలి
 
అలాగే బుధవారం సింధూరం, గంధం, లడ్డూలు లేదా బెల్లం తయారు చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. గణేశుడికి నెయ్యి, బెల్లం అర్పించాలి. ఇంకా మోదకాలు సమర్పించి.. ఆ భోజనాన్ని ఆవుకు తినిపించడం ద్వారా సంపద చేకూరుతుంది. 
 
జ్యోతిషశాస్త్రంలో గణేశుడిని కేతువు దేవతగా భావిస్తారు. ఏదైనా పని ప్రారంభించే ముందు గణేశుడిని పూజిస్తారు. ఇకపోతే ఇంటి ప్రధాన ద్వారం వద్ద గణేశుడి విగ్రహాన్ని ఉంచడం ద్వారా ప్రతికూల శక్తులు ఇంటి లోపలికి రావు అని నమ్ముతారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన నేపాల్ ఏకైక కుబేరుడు

రెండో వారంలో అడుగుపెట్టిన ప్రాంతీయ యుద్ధం.. గల్ఫ్ దేశాలపై ఇరాన్ బాంబుల వర్షం

ఇరాన్‌‍తో యుద్ధం ముగిసిన తర్వాత మీ సంగతి చెప్తాం : బ్రిటన్‌కు ట్రంప్ వార్నింగ్

రాజమండ్రి కల్తీపాలనో ఇథలీన్ గ్లైకాల్ - తాగితే కిడ్నీలో పాడైపోవాల్సిందే..

రాష్ట్రపతి ముర్ముకు అవమానం... సీఎం చంద్రబాబు అసహనం

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇంద్రకీలాద్రి కొండపై మహాకుంభాభిషేకం... హాజరుకానున్న చంద్రబాబు, పవన్

06-03-2026 శుక్రవారం ఫలితాలు : ప్రైవేట్ ఫైనాన్సుల జోలికిపోవద్దు...

05-03-2026 గురువారం ఫలితాలు- అన్ని విధాలా బాగుంటుంది..

04-03-2026 బుధవారం ఫలితాలు : దంపతుల మధ్య అకారణ కలహం....

చంద్రోదయంతోనే చంద్రగ్రహణం, ఏ రాశివారికి ఎలాంటి ఫలితాలు?

తర్వాతి కథనం
Show comments