Webdunia - Bharat's app for daily news and videos

Install App

20-09-2018 గురువారం మీ రాశి ఫలితాలు...

మేషం: ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్‌ఎస్టేట్ వ్య

Webdunia
గురువారం, 20 సెప్టెంబరు 2018 (09:55 IST)
మేషం: ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్, ట్రావెలింగ్ రంగాల వారికి కలిసిరాగలదు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు అదనపు బరువు బాధ్యతలు స్వీకరిస్తారు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. బ్రోకర్లకు, ఏజెంట్లకు, రియల్‌ఎస్టేట్ వ్యాపారస్తులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. 
 
వృషభం: ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఉద్యోగస్తులు స్థానచలన యత్నాల్లో కొంతపురోగతి కనిపిస్తుంది. స్త్రీల ఆడంబరాలను చూసి ఎదుటివారు అపోహపడతారు. విద్యార్థులతో నూతన ఉత్సాహం కనిపిస్తుంది. ఎంతో కొంత పొదుపు చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. 
 
మిధునం: ఆస్తివ్యవహారాల్లో కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపిస్తుంది. ఖర్చులు అంతగా లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. సినిమా, కళా రంగాల్లో వారికి మార్పులు అనుకూలం. ప్రింటింగ్ రంగాల వారికి అరకొర పనులే లభిస్తాయి. రియల్‌ఎస్టేట్ రంగాలవారికి ఊహించిన ఇబ్బందులెదురవుతాయి.  
 
కర్కాటకం: కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండడం మంచిది. మీ కళత్ర మెుండివైఖరి మీకెంతో చికాకు కలిగించగలదు. మీ ప్రియతములకోసం పిల్లల కోసం ధనం బాగుగా వెచ్చిస్తారు. కొన్ని వ్యవహారాలు అనుకూలించినా మరికొన్ని ఆందోళన కలిగిస్తాయి.  
 
సింహం: ఉపాధ్యాయులు ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. డాక్టర్లకు అనుభవజ్ఞులతో పరిచయాలు, మంచి గుర్తింపు లభిస్తుంది. ఉన్నతస్థాయి అధికారులకు కిందిస్థాయి సిబ్బంది సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశలొదిలేసుకున్న మెుండి బాకీలు వసూలవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది.  
 
కన్య: మీ నిజాయితీకి మంచి గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. పాత్రికేయులకు ఒత్తిడి, పనిభారం అధికం. కొత్త రుణాల కోసం అన్వేషిస్తారు. దైవకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. నగుదు చెల్లింపు చెక్కుల జారి విషయంలో జాగ్రత్త వహించండి.  
 
తుల: విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెంపొందటంతో పాటు తోటి విద్యార్థులతో పోటీ పడతారు. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో వైద్యుని సలహా తప్పదు. దంపతుల మధ్య మనస్పర్ధలు, కలహాలు తలెత్తగలవు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం.     
 
వృశ్చికం: ధనం నిల్వ చేయాలనే మీ ఆలోచన ఫలించదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారేు. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలవారికి పురోభివృద్ధి. బ్యాంకింగ్ రంగాలవారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. స్వతంత్ర వృత్తులలో వారికి జయం చేకూరును.  
 
ధనస్సు: ప్రింటింగ్ రంగాలవారికి బాకీలు వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ముక్కుసూటిగా పోయే మీ ధోరణి ఇబ్బందులకు దారితీస్తుంది. వార్తా సంస్థలలోని సిబ్బందికి మార్పులు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ప్రభుత్వ రంగాలలో వారికి సమస్యలు తలెత్తుతాయి.  
 
మకరం: విద్యార్థులకు విద్యావిషయాలలో ఏకాగ్రత ముఖ్యం. ఖర్చులు మీ రాబడికి మించడం వలన స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. స్త్రీలు అనవసర విషయాలకు దూరంగా ఉండడం క్షేమదాయకం. ఉమ్మడి వ్యాపారాలు, లీజు, ఏజెన్సీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో మెళకువ వహించండి. ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికం. 
 
కుంభం: ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. రావలసి ధనం కొంత ముందువెనుకలుగానైనా అందుతుంది. విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దూరప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. 
 
మీనం: మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావచ్చు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది. శత్రువులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగస్తులు తోటివారి నుండు ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఐరన్, కలప, సిమెంట్ వ్యాపారస్తులకు మందకొడిగా ఉండగలదు.  

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments