Webdunia - Bharat's app for daily news and videos

Install App

30-10-2022 ఆదివారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని తులసీదళాలతో..

Webdunia
ఆదివారం, 30 అక్టోబరు 2022 (05:00 IST)
మేషం :- ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. స్త్రీలకు పని భారం అధికమవుతుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. కుటుంబీకులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖులకు బహుమతులు అందజేస్తారు. బంధు మిత్రులు మీ వైఖరిని తప్పు పడతారు.
 
వృషభం :- ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధువుల రాక వల్ల తలపెట్టిన పనిలో ఒత్తిడి, ఆటంకాలను ఎదుర్కుంటారు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. ఎవరికైన ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. జాగ్రత్త వహించండి.
 
మిథునం :- మీ శ్రీమతి మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగంలో శ్రమకు నైపుణ్యతకు మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకోని విధంగా మీరు ప్రయాణం చేయవలసివస్తుంది. బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు.
 
కర్కాటకం :- స్త్రీలకు అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వివాదాస్పదాలలో తలదూర్చకండి. సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. రుణం తెచ్చే ప్రయత్నంలో సఫలీకృతులౌతారు.
 
సింహం :- స్త్రీలకు షాపింగులో నాణ్యతను గయనించాలి. మీకు రావలసిన అవకాశాలు, పదవులు వేరొకరికి లభిస్తాయి. కొన్ని విషయాలు మరచిపోదామనుకున్నా సాధ్యంకాదు. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. ఉద్యోగస్తులు విశ్రాంతి లభిస్తుంది. ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
కన్య :- ఎంత సంపాదించినా ధనం నిలబెట్టలేకపోతారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మీ బంధువులు, కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపారాల్లో కొంత నిరాశ తప్పదు. మీ సంతానం మొండి వైఖరి వల్ల చికాకులు తప్పవు.
 
తుల :- కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ద వహించండి. సాహస ప్రయత్నాలు విరమించండి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారం అందిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు ఆకస్మికంగా వాయిదాపడతాయి.
 
వృశ్చికం :- అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్ధలు తొలగిపోతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, తగిన ప్రోత్సాహం లభిస్తుంది.
 
ధనస్సు :- పొట్ట, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికం. నిరుద్యోగులు నిర్లక్ష్యం వల్ల మంచి మంచి అవకాశాలు చేజార్చుకుంటారు. విదేశాలు వెళ్ళాలి అనే అలోచనను క్రియారూపంలో పెట్టండి. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ మనోసిద్ధికి ఇది సరైన సమయం అని గమనించగలరు.
 
మకరం :- రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి కలిసివస్తుంది. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ధైర్యంతో మందడుగు వేస్తే తప్ప అది ఆనందదాయకం కాదు. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయటం మంచిదికాదు. బంధుమిత్రుల కలయిక మీకెంతో సంతృప్తి కానవస్తుంది.
 
కుంభం :- మీ సంతానం భవిష్యత్తు బాగుంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచు కోవటం శ్రేయస్కరం. వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. మీకు నచ్చని సంఘటనలు కొన్ని ఎదురుకావచ్చు. తల, కణతకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనవలసివస్తుంది.
 
మీనం :- కుటుంబంలో పెద్దల మొండివైఖరి ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖుల కోసం వేచియుండక తప్పదు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. స్త్రీలకు షాపింగులో నాణ్యతను గయనించాలి. స్థిరాస్తి క్రయ విక్రయంలో పునరాలోచన అవసరం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

లేటెస్ట్

Daily Horoscope: 13-07-2025 ఆదివారం దినఫలితాలు - కార్యం సిద్ధిస్తుంది.. ఖర్చులు విపరీతం...

Khairatabad: గణేష్ చతుర్థి వేడుకలకు సిద్ధం అవుతున్న ఖైరతాబాద్ గణపతి

Weekly Horoscope : 13-07-2025 నుంచి 19-07-2025 వరకు మీ వార రాశి ఫలాలు

Shani Dev: శనిదేవుడిని శాంతింపజేయాలంటే ఈ మంత్రాలు పఠించాలి.. నలుపు రంగు దుస్తులు?

12-07-2025 శనివారం దినఫలితాలు - పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి...

తర్వాతి కథనం
Show comments