తరుణ గణపతిని సంకష్టహర చతుర్థి రోజున పూజిస్తే?

Webdunia
శుక్రవారం, 14 మే 2021 (16:15 IST)
Taruna Ganapathi
అనుకున్న పనులన్నీ నెరవేరడం కోసం చక్కని పరిష్కారం తరుణ గణపతిని పూజించడం. వినాయకుని ముప్ఫైరెండు రూపాలలో తరుణ గణపతి రూపం రెండవది. తరుణ అంటే యవ్వనం అని అర్థం. తరుణ గణపతి రూపంలో వినాయకుడు యవ్వన కాంతితో విరాజిల్లుతాడు. 
 
ఈ రూపంలో స్వామికి ఎనిమిది చేతులు ఉంటాయి. కుడిపక్కన ఒక చేతిలో దంతాన్ని, మరొకచేత జామపండుని, ఒక చేత చెరుకు గడలని, మరొక చేత అంకుశాన్ని ధరించి ఉంటాడు. ఎడమవైపున ఒకచేత మోదకాన్ని, ఒకచేత వెలగ పండునీ, ఒకచేత లేత మొక్కజొన్న కంకుల పొత్తినీ, మరొక చేత వలనీ ధరించి ఉంటాడు.
 
తరుణ గణపతి శరీరం కాంతివంతంగా ఎర్రని రంగులో ఉంటుంది. ఎరుపు ఉత్తేజానికీ యవ్వనానికీ ప్రతీక. మధ్యాహ్న కాలపు సూర్యుని తేజస్సుతో తరుణ గణపతి దర్శనమిస్తాడు. 
 
వినాయకునికి ప్రీతికరమైన బుధవారం నాడు, సంకష్ట చతుర్థినాడు, వినాయక చవితినాడు, దూర్వా గణపతి వ్రతం నాడు స్వామిని తరుణ గణపతి రూపంలో పూజించడం వలన ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఆటంకాలు తొలగుతాయి. అనుకున్న కార్యాలు సత్వరం నెరవేరతాయి.
 
స్కాంద పురాణం లోనూ, బ్రహ్మ పురాణంలోనూ,వామన పురాణంలోనూ ముద్గళ పురాణంలోనూ తరుణ గణపతిని గురించిన ప్రస్తావన ఉంటుంది.
 
2. తరుణ గణపతి ధ్యానం
అథ తరుణ గణపతి ధ్యానం ముద్గళ పురాణే
శ్రీ తరుణ గణపతి ధ్యానం
పాశాంకుశాపూపకపిద్థజంబూ
స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః |
ధత్తే సదా యస్తరుణారుణాభః
పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః || 1 || 
ప్రతిరోజూ ఉదయం స్నానాదికాలు ముగించుకుని, శుభ్రమైన వస్త్రాలను ధరించి, తరుణ గణపతి ధ్యానం చేయడం వలన సర్వకార్య సిద్ధి కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచారం కేసులో నిందితుడికి జైలు వద్ద పూలతో ఘన స్వాగతం, ప్రజలు ఆగ్రహం

రూ.3.05 కోట్ల విలువతో కూడిన 8.705 కిలోల గంజాయి ప్యాకెట్ల స్వాధీనం

కన్నబిడ్డను పోలీసులకు స్వయంగా అప్పగించా : బండి సంజయ్

Kerala: కేరళలో వృద్ధురాలికి అమీబిక్ బ్రెయిన్ ఫీవర్‌

అగ్నిగుండాన్ని తలపిస్తున్న తెలంగాణ - వడదెబ్బకు నలుగురు మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

శేషాచలం కొండల్లో 89.4 శాతం పచ్చదనం.. టీటీడీని అభినందించిన సీఎం బాబు

తర్వాతి కథనం
Show comments