Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Akshaya Tritiya 2021: పితృదేవతలను తలచుకుంటూ అన్నం, నెయ్యి?

Akshaya Tritiya 2021: పితృదేవతలను తలచుకుంటూ అన్నం, నెయ్యి?
, శుక్రవారం, 14 మే 2021 (11:00 IST)
అక్షయ తృతీయ. భారతదేశంలోని హిందువులందరూ జరుపుకునే పండగ. ఈ రోజుని అదృష్టానికి, విజయానికి, భవిష్యత్తులో వచ్చే ఆనందాలకి గుర్తుగా జరుపుకుంటారు. వైశాఖ మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున అక్షయ తృతీయ జరుపుకుంటారు.   
 
అన్నపూర్ణాదేవి ఈ రోజే జన్మించిందని నమ్ముతారు. శ్రీకృష్ణ భగవానుడు తన స్నేహితుడు సుదామాకి ఈ రోజు సాయం చేసాడని చెప్పుకుంటారు. అంతేకాదు మహాభారతం ప్రకారం పాండవులు రాజ్యాన్ని వదిలి వెళ్ళేటపుడు వాళ్ళకోసం శ్రీక్రిష్ణుడు అక్షయ పాత్ర ఇచ్చాడని, దానివల్ల ఆహారానికి, నీటికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుందని చెప్పుకుంటారు.
 
ఈ రోజు సింహాచల నరసింహుని చందనోత్సవం జరుగుతుంది. సంవత్సర కాలమంతా చందనం పూతలో సేదదీరే స్వామి తన నిజ స్వరూపాన్ని భక్తులకు చూపి కనువిందు చేస్తాడు. స్వామి వారిది ఉగ్రరూపం కావటం వలన, వారికి శాంతి కలుగుటకై చందనాన్ని ఆయనపై లేపనంగా పూస్తారు.  
 
జాతక చక్రంలో పితృదోషం ఉంటే, దాని నివారణకు పరమ పవిత్రమైన పుణ్యదినం అక్షయతృతీయ.  మన కంటికి కనిపించే గ్రహాలు సూర్యుడు, చంద్రుడు. సకల పితృదేవతలను సూర్యభగవానునిలో దర్శించవచ్చును. 
 
అక్షయ తృతీయ శుభకాలంలో పితృదేవతలను తలచుకుంటూ అన్నం, నెయ్యి, పప్పు కలిపిన చిన్న ముద్దలను ఎండు కొబ్బరిలో నిక్షిప్తం చేసి ఆహుతి చేసినట్లయితే వంశపారంపర్యంగా శుభఫలితాలు పొందవచ్చునని జ్యోతిష పండితులు చెబుతారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శుక్రవారం (14-05-2021) రాశిఫలితాలు - దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేసినా...