ఫిబ్రవరి 13.. కుంభరాశిలోకి సూర్యుడు.. ఈ మూడు రాశులకు అదృష్టం

సెల్వి
గురువారం, 8 ఫిబ్రవరి 2024 (10:50 IST)
Sun Transit In Aquarius
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి 13వ తేదీన సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం సూర్యుడు మకరరాశిలో సంచరిస్తున్నాడు. అలాగే శని మూల త్రికోణ రాణి అయిన కుంభరాశిలో సూర్యుడు ప్రవేశం కారణంగా మూడు రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. అలా సూర్యుడు కుంభరాశికి ప్రవేశించడం ద్వారా ఏ రాశుల వారికి అదృష్టమో తెలుసుకుందాం. 
 
అలాగే సూర్యుడు కన్య రాశిలోని 6వ ఇంట సంచారం చేయడంతో ఊహించని ప్రయోజనాలను పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు అధిక లాభం చేకూరుతుంది. ఉద్యోగాభివృద్ధి వుంటుంది. కీర్తి ప్రతిష్టలు మెరుగవుతాయి. మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడపుతారు. భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. అనుకున్న కార్యంలో విజయం సాధిస్తారు. 
 
ఇంకా సూర్యుడు మిథునరాశి 9వ ఇంటికి వెళతాడు. అందుచేత ఈ మిథునరాశికి అదృష్టం వరిస్తుంది. వృత్తిపరంగా ఉద్యోగస్తులు మంచి పురోగతి సాధిస్తారు. పదోన్నతి లభించవచ్చు. అధిక మొత్తం జీతంతో కూడిన ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్నట్లయితే ఈ సమయం శుభప్రదం. వ్యాపారులకు ఎక్కువ లాభం. కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి.
 
అలాగే సూర్యుడు కుంభంలోకి ప్రవేశించడం ద్వారా కన్యారాశి, మిథునంతో పాటు మేషరాశికి కూడా కలిసివస్తుంది. సూర్యుడు మేష రాశిలోని 11వ గృహంలోకి ప్రవేశిస్తాడు. దీంతో ఈ జాతకులు అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. చిరకాల కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు శుభకాలం. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవర్ స్టార్‌ను ఎప్పుడూ పల్లెత్తు మాట అనలేదు.. విజయసాయి రెడ్డి కొత్తపల్లవి

కారులో షాట్ ‌సర్క్యూట్ - అకస్మాత్తుగా మంటలు ... సజీవదహనమైన డ్రైవర్

మధ్యప్రదేశ్‌ మహిళ బరితెగింపు.. రీల్స్ కోసం అమ్మాయిల కిడ్నాప్

భవిష్యత్‌లో సింధ్‌ ప్రాంతం భారత్‌లో కలవొచ్చు : కేంద్ర మంత్రి రాజ్‌నాథ్

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

అన్నీ చూడండి

లేటెస్ట్

21-11-2025 శుక్రవారం ఫలితాలు - చీటికి మాటికి అసహనం చెందుతారు...

Love: ప్రేమిస్తే ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిల్నే ప్రేమించాలి.. ఎందుకంటే?

20-11-2025 గురువారం ఫలితాలు - ఆర్థికలావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి...

శబరిమల మార్గంలో నెట్‌వర్క్‌ను మెరుగుపరిచిన Vi ; పిల్లల భద్రతకు అనువైన వి సురక్ష రిస్ట్ బ్యాండ్

Vaikunta Darshan: ఆన్‌లైన్‌లోనే వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ

తర్వాతి కథనం
Show comments