Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో అరుదైన దృశ్యం.. ఆ రెండు రోజుల్లో గరుడ సేవ.. ఎప్పుడు?

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సంఘాల్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు,

Webdunia
సోమవారం, 6 ఆగస్టు 2018 (11:35 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో అనిల్‌కుమార్‌ సంఘాల్‌ ఇదివరకే ప్రకటించారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 9 నుంచి 18 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 31 లోపు ఉత్సవాల ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఈవో స్పష్టం చేశారు. 
 
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలు రాత్రి 8 గంటలకే ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 లక్షల లడ్డూలను నిల్వ చేశారు. ఇక శ్రీవారికి గరుడ వాహన సేవ రోజున కొండపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించబోమని ఈవో తేల్చి చెప్పేశారు. ఇకపోతే.. శ్రీవారు కొలువైన తిరుమలలో ఈ నెలలో ఈ నెలలో ఓ అరుదైన దృశ్యం సాక్షాత్కారం కానుంది. 
 
ఒకే నెలలో స్వామివారు తనకు ఎంతో ఇష్టమైన గరుడ వాహనంపై రెండుసార్లు విహరించనున్నారు. ఈ నెల 16న గరుడ పంచమికాగా, ఆపై 26న శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రీనివాసుడు తిరు మాడవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగనున్నారు. 
 
గరుడ పంచమి నాడు సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల మధ్య, ఆపై శ్రావణ పౌర్ణమి నాడు రాత్రి 7 నుంచి 9 గంటల మధ్య గరుడవాహన సేవను నిర్వహించనున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ నెలలో జరిగే రెండు గరుడ సేవలకు పెద్ద ఎత్తున భక్తులు హాజరుకానుండటంతో వారి సౌకర్యార్థం అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పిల్లలకు భోజనం పెట్టే ముందు రుచి చూడండి.. అంతే సంగతులు: రేవంత్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలెర్ట్

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

అన్నీ చూడండి

లేటెస్ట్

28-11-2024 గురువారం ఫలితాలు - దైవదీక్షలు స్వీకరిస్తారు...

Baba Vanga Predictions: బాబా వంగా జ్యోతిష్యం.. ఆ ఐదు రాశులకు అదృష్టమే..

2025లో మేషం, వృషభం, మిథున రాశి దర్శించాల్సిన పరిహార స్థలాలేంటి?

మీనరాశి ఉద్యోగ జాతకం 2025.. చన్నా దాల్, పసుపు ఆవాలు..?

ధనుస్సు 2025 జాతకం.. కుటుంబ సౌఖ్యం.. మంచంపై నెమలి ఈకలు

తర్వాతి కథనం
Show comments