మిస్టర్ రాహుల్.. కమాన్ హగ్ మీ... సీఎం యోగి ఆదిత్యనాథ్
ఇటీవల లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడంపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఈ విషయంలో రాహుల్ చేసిన పనిని కొందరు సమర్థిస్తుంటే.. బీజేపీ మ
ఇటీవల లోక్‌సభ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలింగనం చేసుకోవడంపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ జరిగింది. ఈ విషయంలో రాహుల్ చేసిన పనిని కొందరు సమర్థిస్తుంటే.. బీజేపీ మాత్రం ఆయన తీరును తీవ్రంగా తప్పుబట్టింది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా రాహుల్‌పై విమర్శలు గుప్పించారు.
రాహుల్ చేసింది కేవలం ఓ పొలిటికల్ స్టంట్ అని యోగి అన్నారు. అంతేకాదు నీకు దమ్ముంటే నన్ను హత్తుకో అని సవాల్ కూడా విసిరారు. నన్ను హత్తుకునే ముందు రాహుల్ ఒకటికి 10 సార్లు ఆలోచించుకోవాలి అని యోగి చెప్పారు.
ఇలాంటి రాజకీయ జిమ్మిక్కులను నేను అస్సలు అంగీకరించను. రాహుల్‌వి పిల్ల చేష్టలు. ఆయనకు అంత తెలివితేటలు లేవు. సొంతంగా నిర్ణయం తీసుకోలేరు. హుందాగా ఉండే వ్యక్తి ఎప్పుడూ ఇలాంటి పనులు చేయరు అని యోగి అన్నారు.
ఇక రాహుల్‌ను ప్రతి పక్షాలు ఎలా అంగీకరిస్తాయో అర్థం కావడం లేదని ఈ సందర్భంగా యోగి అన్నారు. రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా అఖిలేష్ యాదవ్, మాయావతి అంగీకరిస్తారా? శరద్ పవర్ ఆయన నాయకత్వంలో పనిచేస్తారా? ప్రతిపక్షాలు తమ నేతగా ఎవరినీ ఎందుకు ప్రకటించడం లేదు? ప్రతిపక్షంలో ఎవరి పాట వాళ్లు పాడుతున్నారు అని యోగి విమర్శించారు.