Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుధవారం రావి చెట్టు కింద ఇలా దీపం వెలిగిస్తే...? (video)

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2020 (05:00 IST)
Peepal Tree
బుధవారం రావి చెట్టును పూజిస్తే సకల అభీష్టాలు నెరవేరుతాయి. ఇంట్లో రావిచెట్టు ఆకులను వుంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప, దోష, కర్మ ఫలితాలు వుండవు. పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. రావిచెట్టు ఆకులను తీసుకొచ్చి.. దానిపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపమెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. 
 
శనిగ్రహ దోషాలు, సర్పదోషాలు, రాహు-కేతుదోషాలు, నవగ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా దీపం వెలిగించాలి. మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు, బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు, గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు, శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు, శనివారం జన్మించిన జాతకులు 9 దీపాలు, ఆదివారం జన్మించిన జాతకులు 12 రావి ఆకులపై ప్రమిదలను వుంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి. 
light lamp
 
రావిచెట్టు ఆకు కాడ దేవుని పటాల వైపు వుండేలా, ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చుని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే దోషాలు తొలగి, శుభ ఫలితాలను ఆశించవచ్చునని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

లేటెస్ట్

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

Vastu: వాస్తు శాస్త్రం: నల్లపిల్లిని ఇంట్లో పెంచుకోకూడదా? బంగారు పిల్లిని పెంచుకుంటే?

తర్వాతి కథనం
Show comments