తాటికాయల కాలం వచ్చేసింది. తాటి ముంజకాయలు ముదిరి తాటికాయలుగా మారుతాయి. వీటి నుంచి వచ్చే తాటిచాప, తాటి బెల్లంలో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు వున్నాయి. తాటి బెల్లం తీసుకుంటే బెల్లంలో చిన్నపాటి జబ్బుల నుంచి అనీమియాను దూరం చేసుకోవచ్చు. అంతేకాదు వివిధ రకాల అనారోగ్యాలకు ఈ తాటి బెల్లం తినడం ద్వారా చెక్ పెట్టవచ్చు. తాటి బెల్లంలో పోషక విలువలు సమృద్ధిగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ తాటి బెల్లం
చాలా ఉపయోగం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలను తొలగించడంలోనూ సాయపడుతుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా వుండే తాటిబెల్లం మైగ్రేన్, బరువు తగ్గడంలోనూ, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియాను దూరం చేస్తుంది. అలాగే జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరు మెరుగు పరుస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.