Webdunia - Bharat's app for daily news and videos

Install App

దీపం వెలిగిస్తే ఇంత మంచి జరుగుతుందా?

సెల్వి
బుధవారం, 26 జూన్ 2024 (12:36 IST)
ఒక దీపాన్ని వెలిగించినప్పుడు, అది దృశ్యపరంగానే కాకుండా, శక్తిపరంగా కూడా పూర్తి ప్రదేశాన్ని ఒక భిన్నమైన శక్తితో నింపుతుంది. ఒక నూనె దీపాన్ని వెలిగించటంలో కొన్ని సూచనలు ఉన్నాయి. దీపాన్ని వెలిగించటానికి కొన్ని ప్రత్యేకమైన నూనెల వినియోగం ముఖ్యం. 
 
ప్రత్యేకించి నువ్వుల నూనె, ఆముదం లేదా నెయ్యి, ఇవి అనుకూల శక్తిని వెలువరిస్తాయి. అగ్ని పలు విధాలుగా వెలుగుకి, జీవితానికి మూలం. నూనె దీపంతో గృహంలో సానుకూల శక్తిని పొందవచ్చు. నూనె దీపంతో మీరు మీ గృహంలో  సానుకూల శక్తినీ, పరిసరాలనూ, వాతావరణాన్నీ ఎలా సృష్టించుకోవచ్చు.
 
"దీపం జ్యోతి పరంబ్రహ్మ దీపం సర్వ తమోపహమ్
 దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే"
 
దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం. అందుకే దేవుడికి పూజ చేసేప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు. దీపం వెలిగించడం యజ్ఞానికి సమానమైంది. దీపంలోని నూనె దేవుతలకు ఆవిర్భాగంగా చేరుతుంది. ఇంట ఉదయం సాయంత్రం పూట దీపం వెలిగించడం చాలాముఖ్యం. ఉదయం 4.30గంటల నుంచి ఆరు గంటల వరకు, సాయంత్రం 4.30 గంటల నుంచి ఆరు గంటల వరకు దీపం వెలిగించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఇది పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. కర్మను తొలగిస్తుంది. దైవానుగ్రహాన్ని అనుగ్రహిస్తుంది. 
 
జీవితంలో ఏర్పడే అడ్డంకులను తొలగిస్తుంది. ఒకే వత్తులతో దీపం విజయాన్ని ప్రసాదిస్తుంది. రెండు ముఖాలతో దీపం దంపతుల మధ్య అన్యోన్యతను పెంచుతుంది. మూడు వత్తులతో దీపం పుత్ర దోషాలను తొలగిస్తుంది. నాలుగు వత్తులతో దీపం సంపదను ప్రసాదిస్తుంది. 
 
ఐదు ముఖాలతో దీపం అష్టైశ్వర్యాలను చేకూరుస్తుంది. కుటుంబంలో ఐక్యతను ఇస్తుంది. వివాహ అడ్డంకులను తొలగిస్తుంది. పుణ్య ఫలాలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD : జూన్ మాసపు శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల.. వివరాలివే

18-03-2025 మంగళవారం దినఫలితాలు : ఆపన్నులకు సాయం అందిస్తారు...

17-03-2025 సోమవారం దినఫలితాలు -

16-03-2025 ఆదివారం ఆస్ట్రాలజీ - పత్రాల రెన్యువల్లో జాగ్రత్త వహించండి...

దురదృష్టం పరుగెడుతున్నా పట్టుకునేది ఇలాంటివారే

తర్వాతి కథనం
Show comments