ఎనిమిది దిక్కుల్లో దీపాలు వెలిగిస్తే? దక్షిణ దిశలో మాత్రం వద్దే వద్దు.. ఎందుకు?

దిక్కులు ఎనిమిది. ఈ ఎనిమిది దిక్కుల్లో దీపమెలిగిస్తే ఎలాంటి ఫలితాలను పొందవచ్చో చూద్దాం.. తూర్పు- ఈ దిశలో దీపమెలిగించడం ద్వారా జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. గ్రహ దోషాలు

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (15:04 IST)
దిక్కులు ఎనిమిది. ఈ ఎనిమిది దిక్కుల్లో దీపమెలిగిస్తే ఎలాంటి ఫలితాలను పొందవచ్చో చూద్దాం.. 
 
తూర్పు- ఈ దిశలో దీపమెలిగించడం ద్వారా జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. గ్రహ దోషాలు తొలగి.. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. గృహం లేనివారు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇలా అద్దె ఇంటికి స్వస్తి చెప్తారు. 
 
పడమర- ఈ దిశలో దీపం వెలిగించడం ద్వారా శత్రుభయం వుండదు. ధనంతో వచ్చే విభేదాలు తొలగిపోతాయి. రుణబాధలుండవు. 
 
ఉత్తరం- ఈ దిశలో దీపం వెలిగించడం ద్వారా శుభకార్యాలు దిగ్విజయం పూర్తవుతాయి. పాపాలు తొలగిపోతాయి. సౌభాగ్యం చేకూరుతుంది. వివాహ అడ్డంకులు తొలగిపోతాయి. దీర్ఘ సుమంగళీ ప్రాప్తం చేకూరుతుంది. 
 
దక్షిణం- అయితే దక్షిణం వైపు దీపాలను వెలిగించకూడదు. ఈ దిశలో దీపాలను వెలిగిస్తే మృత్యు భయాలుంటాయి. కానీ ఆలయాల్లో దక్షిణం వైపు దీపమెలిగించడం ద్వారా పితృదోషాలు తొలగిపోతాయి. ఇంట మరణించిన వారికి సద్గతి పొందవచ్చు. 
 
ఆగ్నేయ- ఈ దిశలో దీపం వెలిగించడం ద్వారా పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. పిల్లలు విద్యారంగంలో రాణించాలంటే.. నైరుతి దిశలో దీపమెలిగించి ఆ ధూపాన్ని పిల్లల నుదుట చూపించాలి. 
 
నైరుతి- ఈ దిశలో దీపం వెలిగిస్తే.. స్త్రీపురుషులకు వచ్చే ఆపదలు తొలగిపోతాయి. కలహాలుండవు. వివాహ దోషాలు తొలగిపోతాయి. ఐశ్వర్యం సిద్ధిస్తుంది. 
 
ఈశాన్యం- ఈ దిశలో దీపమెలిగించడం ద్వారా ఇంటి యజమానికి సుభిక్షం చేకూరుతుంది. ఇంటి యజమానికి కార్యసాధనలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి. యజమానితో పాటు ఆయన సంతానం ఇతరులకు దానధర్మాలు చేసే ఉన్నత స్థాయికి ఎదుగుతారు. 
 
వాయువ్య - దిశలో దీపమెలిగించడం ద్వారా సోదరీసోదరుల మధ్య ఐక్యత నెలకొంటుంది. కుటుంబంలో తగాదాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో ఓటమి.. రిగ్గింగ్, రౌడీ రాజకీయాల వల్లే కాంగ్రెస్‌ గెలుపు.. మాగంటి సునీత ఫైర్

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసు: డాక్టర్ ఉమర్ నబీ ఇల్లు కూల్చివేత

అక్రమ సంబంధం ఉందనీ.. అందరూ చూస్తుండగా పట్టపగలు భార్య గొంతు కోసి చంపేసిన భర్త

జూబ్లీ హిల్స్ బైపోల్.. హస్తం హవా.. కారుకు బ్రేక్

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు.. కేసీఆర్ ఏమన్నారంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

12-11-2025: నవంబర్ 12, 2025 మీ దిన రాశి ఫలితాలు..సంకల్పం సిద్ధిస్తుంది

దాంపత్య జీవితం సుఖమయం కావాలంటే ఇలాంటి స్నానం చేయాలట

నవంబర్ 12, 2025: కాలభైరవ జయంతి.. కాలభైరవ అష్టకాన్ని ఎనిమిది సార్లు పఠిస్తే?

Black Cat in Dreams: కలలో నల్లపిల్లి కనిపిస్తే మంచిదా లేకుంటే?

11-11-2025 మంగళవారం ఫలితాలు - ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి

తర్వాతి కథనం
Show comments