Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం : రాశిఫలితాలు 26-10-2017

మేషం: ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. దంపతుల మధ్య కలహం తలెత్తుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. మీ సంతానం కోసం విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తార

Daily prediction
Webdunia
గురువారం, 26 అక్టోబరు 2017 (05:41 IST)
మేషం: ఉద్యోగస్తులకు అధికారులతో సమన్వయం లోపిస్తుంది. దంపతుల మధ్య కలహం తలెత్తుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందుతుంది. మీ సంతానం కోసం విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలు చేస్తారు. గృహంలో మార్పులకై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి.
 
వృషభం: హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికీ పనిభారం అధికమవుతుంది. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. ఉమ్మడి వ్యాపారాలు, నూతన పెట్టుబడులు ఆలోచన వాయిదా వేయండి.
 
మిథునం: కళ్యాణ మండపాల కోసం అన్వేషణ సాగిస్తారు. లాయర్లకు రాణింపు ఇతరుల  వివాదాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ముఖ్యమైన వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సివస్తుంది.
 
కర్కాటకం: కొన్ని బంధాలు మీకు అనుకూలంగా మారి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతాయి. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షల్లో ఏకాగ్రత అవసరం. రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సాహకరం. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులు అధికం.
 
సింహం: సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుకుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవడం శ్రేయస్కరం.
 
కన్య: కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. విద్యార్థులు స్వయం కృషితో రాణిస్తారు. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. నూతన పరిచయాలు వ్యాపకాలు కొత్త ఉత్సాహం కలిగిస్తాయి. అలవాటు లేని పనులు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండాలి.
 
తుల: ఇంజనీరింగ్, విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్లు నిరుత్సాహం కలిగిస్తాయి. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
వృశ్చికం: ట్రాన్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ రంగాల్లో వారికి సామాన్యంగా ఉంటుంది. ఒక స్థిరాస్తి కొనుగోలుకు యత్నాలు సాగిస్తారు. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. వ్యాపారాల్లో పోటీ, పనివారలతో చికాకులు ఎదుర్కొంటారు. కుటుంబీకుల కోసం బాగా వ్యయం చేస్తారు.  రుణం తీర్చడంతో  పాటు తాకట్టు విడిపించుకుంటారు.
 
ధనస్సు: రాబడికి మించిన ఖర్చులెదురైనా ఆర్థిక వెసులుబాటు వుంటుంది. కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాల్లో వారికి అనుకూలమైన కాలం. హోల్‌సేల్, రిటైల్ పెద్దమొత్తం స్టాక్‌లో అప్రమత్తంగా వుండాలి. వేధింపుల అధికారి బదిలీ వార్త ఉద్యోగస్తులకు సంతోషం కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు.
 
మకరం: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ అంచనాలు, పథకాలు బెడసికొట్టే ఆస్కారం ఉంది. పట్టువిడుపు ధోరణితో సమస్యలు పరిష్కారమవుతాయి పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖుల సిఫార్సుతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ప్రముఖుల సిఫార్సుతో కొన్ని వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.
 
కుంభం : మీ కుటుంబీకుల మొండితనం, పట్టుదల వల్ల ఒకింత అసహనానిని గురవుతారు.  పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఒత్తిడి, పనిభారం అధికం. పీచు, ఫోం, లెదర్, ఫర్నీచర్ వ్యాపారులకు కలిసిరాగలదు. ఉపాధ్యాయులు సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహారాల్లో చికాకులు తప్పవు.
 
మీనం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ఒక అనుభవం మీకెంతో జ్ఞానాన్ని ఇస్తుంది. చేపట్టే కార్యక్రమాల్లో ఒడిదుడుకులు తప్పవు. తమ మాటే నెగ్గాలనే పంతం ఇరువురికి తగదు. గౌరవప్రదమైన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

Chandrababu: జగన్ ఇబ్బంది పెట్టాడు, బాబుకు కృతజ్ఞతలు: ప్రభుత్వ ఉద్యోగి

నడి రోడ్డుపై కానిస్టేబుల్‌పై బీర్ బాటిల్‌తో దాడి (Video)

Telangana tunnel tragedy: తెలంగాణ సొరంగంలో రెస్క్యూ పనులు.. మానవ అవశేషాల జాడలు

అన్నీ చూడండి

లేటెస్ట్

23-03-2025 నుంచి 29-03-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

కాలాష్టమి రోజు కాలభైరవ పూజ.. రాహు, కేతు దోషాల నుంచి విముక్తి

22-03-2025 శనివారం మీ రాశిఫలాలు : ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు...

Mobile Wallpaper Vastu: మొబైల్ వాల్‌పేపర్‌ను ఇలా సెట్ చేస్తే దురదృష్టం పట్టుకుంటుందా?

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

తర్వాతి కథనం
Show comments