Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుజగ్రహ దోషాలున్న జాతకులు.. ఇలా చేస్తే?

కుజ గ్రహదోషాలున్న జాతకులు ఆలయాలకు వెళ్తే సరిపోతుందా? లేకుంటే దోషం కలిగిన గ్రహానికి కూడా పూజ చేయాలా? అనే దానికి సమాధానం కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. గ్రహాలు-పరిహారాలు అంటేనే జాతకులు ఆలయాలకు మాత్రమే వ

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (16:22 IST)
కుజ గ్రహదోషాలున్న జాతకులు ఆలయాలకు వెళ్తే సరిపోతుందా? లేకుంటే దోషం కలిగిన గ్రహానికి కూడా పూజ చేయాలా? అనే దానికి సమాధానం కావాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. గ్రహాలు-పరిహారాలు అంటేనే జాతకులు ఆలయాలకు మాత్రమే వెళ్ళాలనుకుంటున్నారు. అయితే గ్రహదోషాలున్న జాతకులు ఆలయాలకు మాత్రమే పోకుండా.. ఉదాహరణకు.. కుజదోషం ఉన్న జాతకులు రక్తదానం చేయడం వంటివి చేస్తే.. దోష నివారణ అవుతుంది.
 
ఇంకా కుజుడు భూమి కారకుడు కావడంతో ఆలయ ఆస్తులను ఉంచుకున్న వారు వాటిని తిరిగి ఇచ్చేయడం చేయాలి. ఇతరుల స్థలాన్ని ఆక్రమించుకున్నట్లైతే వారికి ఆ ఆస్తులు చేరేలా చేయడం మంచిది. ఇంకా కుజుడు సోదరతత్త్వానికి ప్రతీక. అందుచేత సోదరులకు, సోదరమణీలకు సాయం చేస్తే కుజ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. సహోదరులకు, సోదరీమణులకు ఆర్థిక సాయం లేదా ఇతరత్రా సహాయాలు చేయడం.. వారితో స్నేహభావంతో మెలగడం ద్వారా కుజుడిని శాంతి పరచవచ్చునని.. తద్వారా కుజదోష ప్రభావం తగ్గుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
 
అలాగే కుజదోష జాతకులు మంగళవారాల్లో హనుమంతుడిని పూజించడం చేయాలి. హనుమాన్ జయంతి, వినాయక చతుర్థి నాడు ఆలయానికి వెళ్ళి పూజించడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఎరుపు రంగు దుస్తులను లేదా ఎరుపు రంగు చేతి రుమాలును చేతిలో ఉంచుకోవడం మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి షాకిచ్చిన కోర్టు

జనసేన సంస్థాగత బలోపేతం కోసం త్రిశూల్ వ్యూహం : పవన్ కళ్యాణ్

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

అన్నీ చూడండి

లేటెస్ట్

Sankata Nasana Ganesha Stotram: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని రోజూ పఠిస్తే..?

28-08-2025 గురువారం రాశిఫలాలు - ఎదుటివారి అంతర్యం గ్రహించండి.. భేషజాలకు పోవద్దు...

వినాయక చవితి 2025: ఏకంగా ఐదు యోగాలు.. ఈ రాశుల వారికి అదృష్టం

గణేష్ చతుర్థి: వినాయక పూజ ఎలా చేయాలి?

26-08-2025 మంగళవారం ఫలితాలు - పందాలు, బెట్టింగ్‌కు పాల్పడవద్దు...

తర్వాతి కథనం
Show comments